తాజ్ క్రిష్ణ‌లో త‌ళుక్కుమ‌న్న నారా బ్ర‌హ్మిణి..! రాజ‌కీయాల పై అవ‌గాహ‌న‌కే అంటున్న విశ్లేష‌కులు..!!

యువ మ‌హిళా పారిశ్రామిక వేత్త, చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు నారా బ్ర‌హ్మ‌ణి హోట‌ల్ తాజ్ క్రిష్ట్రాలో త‌ళుక్కుమ‌న్నారు. ఏఐసిసి అద్య‌క్షుడు రాహుల్ గాంధీ పారిశ్రామిక వేత్త‌ల‌తో నిర్వ‌హింంచిన భేటీ సంద‌ర్బంగా నారా బ్ర‌హ్మిణి కూడా హాజ‌ర‌య్యారు. మారుతున్న కాలం అనుగుణంగా వ్యాపారాన్ని టెక్నాల‌జీకి అనుసంధానం చేసే ప‌క్రియ గురించి రాహుల్ ఉప‌న్య‌సించిన‌ట్టు తెల‌స్తోంది.

రాహుల్ గాంధీ ఉప‌న్యాసం యువ పారిశ్రామిక వేత్త‌ల్లో ఉత్సాహం నింపిన‌ట్టు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్త‌లు అభివ‌ర్ణిస్తున్నారు. ఇంత‌కు ముందు అమెరికా అద్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా వ‌చ్చిన‌ప్పుడు ఇదే త‌ర‌హాలో చిరంజీవి కోడ‌లు ఉపాస‌నతో క‌లిసి బ్ర‌హ్మిణి హ‌ల్ చ‌ల్ చేసారు. ఇప్పుడు బ్ర‌హ్మిణి ఒంట‌రిగా ఈ స‌మావేశానికి హాజ‌రై సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు.

పారాశ్రామిక మెళ‌కువ‌ల‌తో పాటు రాజ‌కీయ అవ‌గాహ‌న‌..!

పారాశ్రామిక మెళ‌కువ‌ల‌తో పాటు రాజ‌కీయ అవ‌గాహ‌న‌..!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీ నగరంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణీ హాజరుకావటం ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్న తరుణంలో రాహుల్ గాంధీ పాల్గొనే సమావేశానికి బ్రాహ్మణీ హాజరుకావటం చర్చనీయాంశంగా మారింది.

 యువ మ‌హిళా పారిశ్రామిక వేత్త‌గా నిరూపించుకున్న బ్ర‌హ్మిణి..

యువ మ‌హిళా పారిశ్రామిక వేత్త‌గా నిరూపించుకున్న బ్ర‌హ్మిణి..

హైదరాబాద్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరైనప్పుడు జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశానికి కూడా బ్రాహ్మణీ హాజరయ్యారు. పారిశ్రామికవేత్తగా నారా బ్రాహ్మణీ చాలా చురుగ్గా ఉంటారనే పేరుంది. అయితే ప్రస్తుతం శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్ హైదరాబాద్ లో పారిశ్రామివేత్తలతో సమావేశం కావటం, అందుకు నారా బ్రాహ్మణీ హాజరు కావటం అనేది భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా పరిగణిస్తున్నారు.

రాజ‌కీయాలు తెలియాలంటే ఇలాంటి స‌ద‌స్సులు దోహ‌దంచేస్తాయి..!

రాజ‌కీయాలు తెలియాలంటే ఇలాంటి స‌ద‌స్సులు దోహ‌దంచేస్తాయి..!

ఇవాంకా కార్యక్రమానికి, రాహుల్ గాంధీ కార్యక్రమానికి అసలు ఏ మాత్రం పోలిక కూడా లేదు. అయితే భవిష్యత్ లో నారా బ్రాహ్మణీ రాజకీయాల్లోకి వస్తారని టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఎవరైనా ఈ అంశాన్ని బ్రాహ్మణీతో ప్రస్తావించినా ప్రస్తుతం తన ఫోకస్ అంతా వ్యాపారంపైనే అని చెబుతుంటారు. అటు ఇవాంకా అయినా, ఇటు రాహుల్ గాంధీ టూర్ అయినా పరిస్థితులను అధ్యయనం చేసేందుకే బ్రాహ్మణీ ఇలాంటి కార్యక్రమాలకు హాజరు అవుతుంటారని చెబుతున్నారు.

వ్యాపారంతో పాటు రాజ‌కీయం..! రెండూ అవ‌స‌ర‌మే..!!

వ్యాపారంతో పాటు రాజ‌కీయం..! రెండూ అవ‌స‌ర‌మే..!!

రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉన్న బ్ర‌హ్మిణి తాజా రాజ‌కీయాల ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకునేందుకే ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రౌతున్నార‌నే అభిప్ర‌యం కూడా వ్య‌క్తం అవుతోంది. అంతే కాకుండా పూర్తిగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అగ్రనేతలను వ్యవహారశైలిని తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని చ‌ర్చ జ‌రుగుతోంది. బ్రాహ్మణీతో పాటు ఈ సమావేశంలో టీడీపీ ఎంపీ టీ జీ వెంకటేష్ కుమారుడు భరత్ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+