కేసీఆర్ పాలనపై లోకేష్ ఆరా, బాధ్యతల అప్పగింత (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ రాష్ట్రం పైన దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాడేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై శనివారం టిడిపి అధ్యయన కమిటీలను ఏర్పాటు చేశారు.

పది కీలకాంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యుల్ని నియమించారు. పది కమిటీల్లో ఆరింటికి కన్వీనర్లను ప్రకటించారు.

మిషన కాకతీయ, మిషన భగీరథ, యువత-విద్యార్థి సమస్యలు, వికలాంగుల సమస్యలపై కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు త్వరలోనే కన్వీనర్‌లను నియమిస్తారు. ఎన్టీఆర్‌ భవనలో లోకేశద అధ్యక్షతన తెలంగాణ టిడిపి సమీక్షా సమావేశం జరిగింది.

నారా లోకేష్

నారా లోకేష్

తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుతో పాటు సీనియర్‌ నాయకులు అరవింద్ కుమార్‌ గౌడ్‌, విజయరామారావు, రావులపాటి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలంగాణలో పార్టీ బలోపేతం, ఇంఛార్జుల నియామకం, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై చర్చించారు. అసెంబ్లీలో టిడిఎల్పీకి గదుల తొలగింపుపై న్యాయపోరాటం చేయాలని వారు నిర్ణయించారు.

నారా లోకేష్

నారా లోకేష్

నీటి పారుదల శాఖ కమిటికి కన్వినర్‌గా రేవూరి ప్రకాశ్ రెడ్డిని, డబుల్ బెడ్ రూంకు అరవింద్ గౌడ్‌ను, ఎస్టీ రిజర్వేషన్లకు రమేష్ రాథోడ్‌ను, మైనార్టీ రిజర్వేషన్లకు పెద్దిరెడ్డి, సాజిద్‌లను, రైతు రుణమాఫీకి అరికెల నర్సారెడ్డిని, దళితులకు భూపంపిణీపై సండ్ర వెంకటవీరయ్యను నియమించారు.

నారా లోకేష్

నారా లోకేష్

మరోవైపు, తెలంగాణలో రెండో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటైంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ప్రారంభమైంది. 2005లో గండిపేటలో టిడిపి తొలి మోడల్ స్కూల్ ఏర్పాటు చేసింది.

నారా లోకేష్

నారా లోకేష్

ఏపీ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేయాలని పార్టీ భావించింది. ఈ మేరకు విశ్వనాథపురంలో ఓ పాఠశాలను ఏర్పాటు ప్రారంభించారు. విజయవాడలోని చల్లపల్లిలో మరో దానిని శనివారమే ప్రారంభించారు.

నారా లోకేష్

నారా లోకేష్

విశ్వనాథపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కొద్ది రోజుల క్రితం మూతపడగా, దానిని ఎన్టీఆర్ ట్రస్ట్ యాజమాన్యం అద్దెకు తీసుకుంది. పది రోజుల క్రితం ముహూర్తం బాగుండటంతో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో మోహన్ రావు లాంఛనంగా పూజలు నిర్వహించారు. శనివారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam party leader Nara Lokesh keen on Telangana Chief Minister KCR's administration.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి