హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ బర్బాద్, సీమాంధ్ర ఓట్లు: టిఆర్ఎస్‌పై మరోసారి నారా లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పైన టిడిపి యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సెటిలర్ల విషయంలో తెరాస అవలంభిస్తున్న రెండు నాల్కల ధోరణి మరోసారి తేటతెల్లమైందన్నారు.

ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. గతంలో సెటిలర్ల ఓట్ల విషయంలో రాద్ధాంతం చేసిన తెరాసయే ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకునేందుకు సానుభూతి ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేసారు. దీనికి హైదరాబాద్ బర్బాద్ అన్న హ్యాష్ ట్యాగ్ జోడించారు.

నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?: టిడిపి

హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు టిడిపి నేతలు శనివారం సవాలు విసిరారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ తొలి నుంచీ ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తూ వస్తున్నారని టిడిపి నేతలు రమేష్‌ రాథోడ్‌, వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల మాట్లాడారు. ప్రస్తుతం గ్రేటర్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయలేదన్నారు. తెరాసకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే నైతికత లేదని విమర్శించారు.

Nara Lokesh takes on TRS again

హైదరాబాద్‌లో ఇక పార్కింగ్‌ ఉచితం

హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఉచిత పార్కింగ్‌ సౌకర్యం కల్పించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజధానిలో పెయిడ్‌ పార్కింగ్‌ అక్రమాలను అడ్డుకోడానికి అధికారులు ఆలోచిస్తున్నారు.

ఇప్పటి వరకు హైదరాబాద్‌ జిహెచ్ఎంసి వద్ద అనుమతి తీసుకున్న ప్రాంతాల్లోనే కాక, అక్రమార్కులు అనేక ప్రాంతాల్లో అనధికారిక పార్కింగు ద్వారా దందా నడిపిస్తున్నారు. తద్వారా ఏటా రూ.10కోట్ల వరకు అక్రమంగా రాబడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో వీరి దందాకు తెరదించాలని భావిస్తున్నారు. నగరవ్యాప్తంగా పోలీసులు అనుమతించిన ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్‌ ఏర్పాట్లపై ఆలోచన చేస్తున్నారు.

English summary
Telugudesam party leader Nara Lokesh takes on TRS again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X