వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, టిడిపి యువనేత నారా లోకేష్‌ల మధ్య ప్రత్యక్ష, పరోక్ష వాగ్యుద్ధం సాగుతోంది. వారి మధ్య రోజురోజుకు దాడి, ప్రతి దాడి పెరుగుతోంది.

అయితే, బుధవారం నాడు మంత్రి కెటిఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమైక్య ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్లుగా ఒకింత అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారనడంలో కొంత వాస్తవం ఉందని కెటిఆర్ అన్నారు.

టెక్నాలజీ వచ్చిన ఆ సమయంలో ఎవరున్నా అభివృద్ధి చేసేవారని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఒక్కరి వల్ల అభివృద్ధి కాదని, చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే కెసిఆర్ ఒక్కడి వల్లనో, తన ఒక్కడి వల్లనో అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు. అయితే, ఏపీలా మిగతా రాష్ట్రాలు ఎందుకు టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోయాయని తెలుగు దేశం తమ్ముళ్లు కౌంటర్ ఇస్తున్నారు. అందుకు చంద్రబాబు సమర్థత కారణమని అంటున్నారు.

 రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

హైదరాబాద్ బాగుపడాలంటే ఇవాళ అల్లాటప్పా నాయకులు, పార్టీలతో కాదు, దమ్మున్న నాయకుడు కావాలని, ఆ దమ్మున్న నాయకుడు ఇవాళ అదృష్టవశాత్తు మన సీఎం కేసీఆర్ అని, అందుకే 50 సంవత్సరాలు మోసిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలను ఈసారి పక్కన పెడదామని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు.

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

గ్రేటర్ ఎన్నికల్లో అందరు కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఒక్కరు చాలన్నారు. ఆ అభివృద్ధి కోసం ఓటు వేయాలని జీహెచ్‌ఎంసీ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

 రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులే రావని టీడీపీ, కాంగ్రెస్ నేతలు అన్నారని, కరెంటు ఉండదన్నారని, కానీ అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. వేసవికాలంలోనూ కోతల్లేకుండా కరెంటు అందించామని, నగరానికి గోదావరి నీళ్లు రప్పించామని చెప్పారు.

 రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

భవిష్యత్ అవసరాల కోసం రెండు మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళనతోపాటు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో మరికొంతమందికి ఇళ్ల పట్టాలు అందిస్తామని కేటీఆర్ అన్నారు.

 రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాష్ట్ర పాలన తరహాలోనే నగర పాలనలో కూడా సమూల మార్పులు తెచ్చి ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. మన సీఎం అసెంబ్లీలో నిలబడి రాబోయే మూడేళ్లలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీదికి వచ్చే అవసరం లేకుండా ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు ఇస్తామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు కూడా అడుగను అని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

అరవై ఏళ్లు పాలించినవాళ్లు ఇప్పుడు రోడ్ల గురించి, డ్రెయినేజీ గురించి, దోమల గురించి అడగడం విడ్డూరమన్నారు. 18 నెలల పసికూన ప్రభుత్వంపై మాటలతో దాడులు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

 రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

రోడ్డెక్కి వారసుల 'లోకల్' వార్: బాబు 'అభివృద్ధి'ని ఒప్పుకున్న కెటిఆర్! (పిక్చర్స్)

టీఆర్‌ఎస్‌కు ఐదేళ్లు ప్రజలు అవకాశం ఇస్తే కనీసం ఓపిక పట్టే పరిస్థితి వారికి లేదని కెటిఆర్ విమర్శించారు. అరవై ఏళ్ల దరిద్రాన్ని 18 నెలల్లోనే కడిగేయగలమా అన్నారు. ఇలాంటి పార్టీలతో జాగ్రత్త ఉండాలని, ఓటు వేసే ముందు ఒకటికి, రెండుసార్లు ఆలోచించాలి అని మంత్రి ఓటర్లను కెటిఆర్ కోరారు.

కెటిఆర్

కెటిఆర్

విద్యావంతులు చాలా మంది ఓటు వేసేందుకు రావడం లేదని, ఐటీ ఉద్యోగులు ఓటింగ్‌కుదూరం ఉంటున్నారనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్‌ తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 2న ఒక గంట సమయం కేటాయించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కెటిఆర్ కోరారు. ఐటీ ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

నారా లోకేష్

నారా లోకేష్

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్‌ బుధవారం జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్‌ షోలలో పాల్గొని ప్రసంగించారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలంగాణ సమస్యల పైన కేంద్రానికి ఏ నివేదికా పంపకుండానే నిధులు ఇవ్వడం లేదని నిందలు వేస్తున్నారని, ఈ పద్దెనిమిది నెలల్లో ఢిల్లీకి కెసిఆర్ ఎన్నిసార్లు వెళ్లారో చెప్పాలని నారా లోకేష్ ప్రశ్నించారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఇళ్లు కావాలా అని తెలంగాణ సర్కారును కేంద్రం అడిగితే, సమాధానం చెప్పకుండా ఫాంహౌస్‌లో కుంభకర్ణుడిలా సీఎం కెసిఆర్ నిద్రపోయారని, దీంతో కేంద్రం కేవలం పదివేళ ఇల్లు మంజూరు చేసిందన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఈ విషయం తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబుకు చెప్పడంతో, ఆయన ప్రధాని మోడీతో మాట్లాడారని, అలా చంద్రబాబు మరో యాభై వేల ఇళ్లు ఇప్పించారన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఇళ్ల విషయంలో కెటిఆర్‌కు దమ్ముంటే తన తండ్రి కుంభకర్ణుని మాదిరాగా పడుకున్నాడో లేదో సమాధానం చెప్పాలని నారా లోకేష్ సవాల్ విసిరారు.

నారా లోకేష్

నారా లోకేష్

అమరావతికి నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసునని, తెలంగాణ సర్కార్ మొద్దు నిద్రతో ఇక్కడ కూడా తామే కేంద్రం నుంచి తేవాల్సి వస్తోందని విమర్శించారు.

English summary
Nara Lokesh verus KTR in GHCM Election campaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X