పురుగుల మందు తాగి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆత్మహత్య
నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అతను నాలుగు రోజుల క్రితం సెలవులపై వెళ్లాడు.
సంగారెడ్డి: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అతను నాలుగు రోజుల క్రితం సెలవులపై వెళ్లాడు.
ఆ తర్వాత సోమవారం విధుల్లో జాయిన్ అయ్యాడు. ఇంతలో మంగళవారం బైపాస్ పక్కన విగతజీవిగా కనిపించాడు.

తెల్లవారుజామున పట్టణ శివారలోని బైపాస్ రోడ్డుపై ఆయన మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుల మందుడబ్బా ఉండడంతో పాటు ఆయన నోట్లో నుంచి నురగలు వచ్చాయని స్థానికులు చెప్పారు.
నెలరోజుల క్రితమే మహేందర్ పదోన్నతిపై నారాయణఖేడ్ డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications