ఆందోళనకరంగా ఆత్మహత్యలు: ఇండియాలో గత ఐదేళ్ళలో ఎంతమంది మెడికోలు సూసైడ్స్ చేసుకున్నారంటే!!
మెడికో ప్రీతి ఆత్మహత్యపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో జాతీయ వైద్య మండలి భారతదేశంలో గత ఐదేళ్లలో మెడికల్ ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నదానిపైన నివేదికను ఈరోజు రిలీజ్ చేసింది.
ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి నిన్న రాత్రి తుది శ్వాస విడిచింది. సీనియర్ వైద్య విద్యార్థి వేధింపులతో ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఇక ఇదే సమయంలో ప్రీతి మృతి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసుల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ఇదే సమయంలో జాతీయ వైద్య మండలి భారతదేశంలో గత ఐదేళ్లలో మెడికల్ ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నదానిపైన నివేదికను ఈరోజు రిలీజ్ చేసింది.

గత ఐదేళ్ళలో దేశంలో ఆత్మహత్య చేసుకున్న మెడికోల డేటా ఇదే
జాతీయ వైద్య మండలి రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో గత ఐదు సంవత్సరాలలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోగా అందులో 64 మంది అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు ఉన్నట్టు పేర్కొంది. 55 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. అంతేకాదు గత ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1,116 మంది విద్యార్థులు మెడిసిన్ కు గుడ్ బై చెప్పారని పేర్కొంది.

వైద్య విద్యను మధ్యలో వదిలి వెళ్ళిన వారి డేటా ఇదే
అండర్ గ్రాడ్యుయేషన్ లో 160 మంది విద్యార్థులు, పీజీ జనరల్ సర్జరీ లో 114 మంది విద్యార్థులు, గైనకాలజీలో 103 మంది విద్యార్థులు, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ లో 50 మంది విద్యార్థులు, ఎమ్మెస్ ఈఎన్టీలో వంద మంది విద్యార్థులు, ఎండి జనరల్ మెడిసిన్ లో 56 మంది విద్యార్థులు, ఎండి పీడియాట్రిక్స్ లో 54 మంది విద్యార్థులు తదితర ఇతర బ్యాచ్ లు కలిపి మొత్తంగా 592 మంది వైద్య విద్యను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయినట్టు జాతీయ వైద్య మండలి వెల్లడించింది.

వైద్య విద్యార్థుల డ్రాప్ ఔట్స్ పై, సూసైడ్ లపై దృష్టి సారించాలి
అయితే ఎంతో ఇష్టంగా కష్టపడి సాధించిన మెడిసిన్ కోర్సుల నుండి విద్యార్థులు ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు అన్న దానిపై అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. అలాగే వైద్య విద్యార్ధుల సూసైడ్స్ పెరుగుతున్న నేపధ్యంలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం, కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయటం చెయ్యాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications