ఇంటర్ పాస్ విద్యార్థులకు 1 లక్ష వరకు స్కాలర్‌షిప్- అర్హతలు, దరఖాస్తులు..!!
ఇంటర్ పాస్ అయిన విద్యార్దులకు బిగ్ ఆఫర్. ఏపీ, తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో గతం కంటే ముందుగానే ఈ సారి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో నేషనల్ స్కిల్ అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పాస్ అయిన విద్యార్ధుల కోసం కీలక ప్రకటన చేసింది. వీరి కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ ఆఫర్ చేసింది. ఇందు కోసం ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులకు ఫీజు రాయితీతో పాటుగా.. రూ లక్ష వరకు స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులకు స్కాలర్ షిప్ పొందే అవకాశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు నేషనల్ స్కిల్ అకాడమీ బిగ్ ఆఫర్ అందిస్తోంది. వీరికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం క్రింద 100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులు ఆన్లైన్ లో నేర్చుకునేందుకు 1 లక్ష వరకు కోర్సు ఫీజు లో రాయితీ కల్పిస్తారు . ఈ ప్రోగ్రాం ద్వారా ఇంటర్ లో మర్క్స్ గ్రేడింగ్ ఆధారంగా 1 లక్ష వరకు స్కాలర్ షిప్ కు ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం కొరకు తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు www.nationalskillacademy.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కాంటాక్ట్ ఫోన్ నెంబర్: 9505800050 సంప్రదించాలని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ సారి పెరిగిన ఉత్తీర్ణత శాతం
కాగా, ఇప్పటికే నేషనల్ స్కిల్ అకాడమీ ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో పాటుగా వందకు పైగా సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్..ఆఫ్ లైన్ లో శిక్షణ అందించింది. ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన విద్యార్ధుల కోసం ఈ తాజా ప్రకటన చేసింది. ఇక.. ఏపీలో ఈ రోజు ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. గత 12 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది ఫలితాల్లో నమోదైంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య మొదటి ఏడాది 3,61,526 మంది కాగా, రెండో ఏడాది 3,59,816 మంది హాజరయ్యారు. ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలురు:72 శాతం, బాలికలు: 81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సర పరీక్ష ఫలితాల్లో 81 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు: 76 శాతం, బాలికల: 85 శాతం గా అధికారులు వెల్లడించారు












Click it and Unblock the Notifications