సిట్‌లో మార్పులు: నయీం ఫ్యామిలీ ముందే చంపేవాడు, భయంతో..
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)లో సోమవారం నాడు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
సిట్ బృందంలో కరీంనగర్ ఓఎస్డీ ప్రియదర్శన్, ఖమ్మం అదనపు ఎస్పీ సాయికృష్ణ, హైదరాబాద్ ఎస్‌బీ అదనపు డీసీసీ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, నార్సింగ్ ఇన్స్‌పెక్టర్ రామచంద్ర రావును నియమించారు. సిట్ పర్యవేక్షణాధికారిగా శాంతి భద్రతల అదనపు డీజీ అంజనీ కుమార్ వ్యవహరించనున్నారు.

కుటుంబ సభ్యుల ఎదుటే చంపేసేవాడు
నయీం చేసిన, చేయించిన హత్యలు చాలానే ఉంటాయని సిట్ అనుమానిస్తోంది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో.. అతను దాదాపు 20 వరకు హత్యల్లో నిందితుడిగా తేలింది. మరికొన్ని హత్య ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
'ఆపరేషన్ నయీం': అక్కడే మలుపు తిరిగింది!
నయీం లక్ష్యంగా చేసుకున్న వారిన వారి కుటుంబ సభ్యుల ఎదుటే దారుణంగా హత్య చేసేవాడని తెలుస్తోంది. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఎక్కడా చెప్పేవారు కాదని, ఇంట్లో ఎవరో ఒకరు హత్యను తమ మీద వేసుకొని మిగతా కుటుంబాన్ని రక్షించేవారని తెలుస్తోంది. అందుకే నయీం చేసిన హత్యలు బయటకు రాలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications