నయీం షాకింగ్: ఇంటికి గట్టి భద్రత, ఆడవాళ్లతో ప్రయాణం, డెన్‌లో స్త్రీలు

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం గురించి ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వైపు షాద్ నగర్‌లో నలుగురు మహిళలు సహా ఎనిమిది మందిని విచారిస్తున్న పోలీసులు, నార్సింగిలోని అతని నివాసంలో సోదాలు చేస్తున్నారు.

షాద్ నగర్లో అతను పట్టుబడ్డ ప్రాంతంలో పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. ఈ విచారణలో అతని గురించి ఎన్నో విషయాలను వారు రాబడుతున్నారు. అతను పలువురిని బెదిరించి, డబ్బులు సంపాదించినట్లుగా తెలుస్తోంది.

నార్సింగిలో గట్టి భద్రతతో ఇల్లు

నయీం హైదరాబాదులోని నార్సింగిలో గట్టి భద్రతతో ఉన్న ఇంటిలో అతను నివసిస్తున్నాడు. షాద్ నగర్లో అతనిని ఎన్‌కౌంటర్ చేసిన అనంతరం పోలీసులు నార్సింగిలోని అతని ఇంటిని చుట్టుముట్టారు. భార్యా, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారని తెలుస్తోంది.

Nayeem travelled with woman for security

నార్సింగిలోని అతని నివాసంలో వందలాది డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. అతని ఇంట్లో ఓ రివాల్వర్ దొరికింది. నయీం గత నాలుగేళ్లుగా ఈ ఇంటిలో ఉంటున్నాడు. ఇంటికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు. చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. గ్రిల్స్ ఉన్నాయి.

మహిళలతో ప్రయాణం

నయీం గురించి మరో షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది. అతను ఎక్కడకు ప్రయాణించినా మహిళలతో కలిసి ప్రయాణించేవాడని తెలుస్తోంది. నయీంకు చెందిన ప్రతి డెన్‌లోను ఆడపిల్లలు ఉన్నట్లుగా సమాచారం. ఆడపిల్లలతో కలిసి ప్రయాణిస్తే భద్రత ఉంటుందని భావించేవాడని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+