వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలతో నయీం అక్కడా జల్సా, ఆమెపై మనసుపడ్డ రిటైర్డ్ అధికారి!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం విశ్రాంతి కోసం, ఎంజాయ్ చేసేందుకు పలుచోట్ల గేస్ట్ హౌస్‌లు ఏర్పాటు చేసుకున్నాడు. వాటిని జల్సాలకు అడ్డాగా మార్చుకొన్నాడు. ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్‌లోనూ అతను ఓ గెస్ట్ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

తన తల్లి తాహెరా బేగం పేరిట 2011లో దానిని రూ.3 లక్షలకు కొన్నాడు. రెండు ఏసీలు, సోఫాలు, బెడ్లు, సీసీ కెమెరాలు పెట్టాడు. నయీం ఇక్కడకు వచ్చినప్పుడు అతని చుట్టూ పద్దెనిమిది నుంచి 25 ఏళ్ల అమ్మాయిలు ఉండేవారని అంటున్నారు.

వాళ్లు బురఖాల్లో ఉండేవారని, ఇంట్లోకి వెళ్లగానే లెగ్గింగ్స్‌, టాప్స్‌, షార్ట్‌ జీన్స్ వేసుకొనే వారని ఆ ఇంట్లో ఎలక్ట్రీ‌షియన్‌గా పని చేసిన వ్యక్తి చెప్పాడని తెలుస్తోంది. ఎలక్ర్టికల్‌ పనులు జరుగుతుంటే అమ్మాయిలను మరో గదిలోకి పంపేవాడని చెబుతున్నారు. స్థానిక ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి నయాం తన తండ్రి నసీరుద్దీన్, తల్లి తాహేరా బేగం పేరుతో రూ.1,10,116 విరాళంగా ఇచ్చాడు. నయీం రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న విషయం కూడా తెలిసిందే.

నయీం కేసులో షాక్: టీవీ ఛానల్ సీఈవో అరెస్ట్, చత్తీస్‌గఢ్‌లో కొత్త యాంగిల్ నయీం కేసులో షాక్: టీవీ ఛానల్ సీఈవో అరెస్ట్, చత్తీస్‌గఢ్‌లో కొత్త యాంగిల్

 'Nayeem wanted a peek into political affairs'

ఆ కారు సెంటిమెంట్

నయీంకు కప్పం కట్టడానికి ఎవరైనా నిరాకరిస్తే.. వారిని బెదిరించి భువనగిరి శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయం లేదా పాత బస్టాండ్ వద్ద సాయిబాబా ఆలయం దగ్గరకు రావాల్సిందిగా అతని అనుచరులు చెబుతారని తేలింది. అక్కడ ఆలయంలో దర్శనం అనంతరం నాయకుడి వద్దకు వద్దకు బయలుదేరేవారు. ఇది వారికి సెంటిమెంట్ అని తెలుస్తోంది. అలాగే 'డస్టర్' వాహనంలో తీసుకెళ్లడం సెంటిమెంటుగా తెలుస్తోంది.

చిక్కుల్లో రిటైర్డ్ ఐపీఎస్?

నయీంతో సంబంధాలి కలిగి ఉన్న ఓ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇప్పుడు పీకల్లోతు చిక్కుల్లో పడ్డారని వార్తలు వస్తున్నాయి. సదరు అధికారి మెడకు బలంగా బిగుసుకునే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. నయీంకు పలువురు పోలీసులు, రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కొందరు పోలీసు అధికారులు మాత్రం నయీంతో సంబంధాలను పోలీసింగు, వ్యాపార సంబంధాలను దాటి మరింత ముందుకు తీసుకెళ్లారని అంటున్నారు. అందులో ఈ అధికారి ఒకరు అంటున్నారు. తొలుత సదరు అధికారి నయీంను పోలీసు అవసరాలకు వినియోగించినా సాన్నిహిత్యం పెరిగినకొద్దీ నయీంతో వ్యాపార సంబంధాలను పెంచుకున్నాడు.

తన దగ్గరి బంధువును నయీంకు పరిచయం చేసి, మరికొన్ని డీల్స్‌ నిర్వహించాడని వార్తలు వస్తున్నాయి. నయీం 18-25 ఏళ్ల మధ్య వయసున్న యువతులను రక్షణ కవచంలా, వ్యక్తిగత అవసరాలకూ వాడుకునేవాడు.

నయీంకు రక్షణ కవచంలా ఉన్న ఓ అమ్మాయిపై సదరు అధికారి మనసు పారేసుకున్నాడని, ఆ అమ్మాయిని నయీం ఆయన వద్దకు పంపాడనీ తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. కాలక్రమంలో అదే అమ్మాయి గర్భం దాల్చడంతో ఆమెను సదరు ఐపీఎస్‌ దగ్గరి బంధువు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా కూడా తెలుస్తోందని అంటున్నారు.

English summary
An associate of Nayeem, who was arrested in Nalgonda on August 24, has told the police on Saturday that the former Maoist turned gangster was keen to know the internal affairs of various political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X