నయీమ్‌కు నమ్మిన బంటు: వెనకా, ముందు శ్రీధర్ గౌడే!

హైదరాబాద్: షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు చాలా మంది అనుచరులున్నారు. వారి ద్వారానే తన కార్యకలాపాలను చక్కబెట్టేవాడు. అయితే, నయీమ్ మాత్రం అందర్నీ నమ్మేవాడు కాదు. ఒక్క శ్రీధర్ గౌడ్‌ను తప్ప. అందుకే అతడ్ని నయీమ్‌కు నమ్మిన బంటూ అంటుంటారు తెలిసినవారు. ఏ విషయమైనా దాపరికం లేకుండా శ్రీధర్ గౌడ్‌తో చర్చించేవాడట నయీమ్.

నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతని నేర సామ్రాజ్యానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ గౌడ్‌కు సంబంధించిన విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం పరిధిలోని తుర్కయాంజాల్‌కు చెందిన శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే తన ప్రధాన 'డెన్' వివరాలు తెలిపాడు నయీమ్. ఇతడే టార్గెట్ల 'రవాణా' బాధ్యతలు చూసుకునేవాడు.

నయీమ్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని పనులు చక్కబెట్టేవాడట శ్రీధర్ గౌడ్. కాగా, పోలీసుల విచారణలో నయీమ్ భార్య హసీనా బేగం కూడా పలు కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం.

ఆ సమాచారం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో తన సమీప బంధువు సయ్యద్ సాదిఖ్ పాషా పేరుతో ఉన్న ఇంటినే నయీమ్ తన ప్రధాన డెన్‌గా వినియోగించుకున్నాడు. ఇంట్లో తన సమీప బంధువు మతీన్ కుటుంబాన్ని ఉంచి.. టార్గెట్లను బెదిరించడంతోపాటు కీలక వ్యవహారాలూ ఇక్కడ నుంచే నెరపేవాడు.

అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప సాధారణంగా కుటుంబీకుల్ని అక్కడకు తీసుకువెళ్లేవాడు కాదు. 'మామిడి' అనే పేరు పెట్టిన ఈ ఇంటి వివరాలను అందరికీ తెలియనీయలేదు. ప్రతి ఒక్కరినీ అనుమానించే నయీమ్.. యాక్షన్ టీమ్ సభ్యులతోపాటు తనకు నమ్మిన బంటుగా ఉన్న శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే ఈ ఇంటి గురించి చెప్పాడు.

 Nayeemuddin main aide Sridhar goud

టార్గెట్లను తొలుత అనుచరుల ద్వారా, ఆపై ఫోన్‌లో బెదిరించేవాడు. అవసరమైతే వారిని 'మామిడి'కి రప్పించి 'గడాఫీ సైన్యం(సాయుధులైన అమ్మాయిలు)' మధ్యలో కూర్చుని బెదిరించే వాడు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారినైనా ఎల్బీ నగర్ మీదుగానే షాద్‌నగర్‌లోని డెన్‌కు రప్పించేవాడు.
టార్గెట్లను అనుచరులు ఎల్బీనగర్ వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి వారి కళ్లకు గంతలు కట్టి, షాద్‌నగర్‌కు తరలించేది మాత్రం శ్రీధర్‌గౌడ్ అని సమాచారం. కాగా, శ్రీధర్‌గౌడ్ ఈ దందాల్లో 'రెడ్డి భయ్యా' గా చెలామణి అయ్యాడని తేలింది.

హత్యతోనే ముగింపు

నయీమ్ ఎవరినీ నమ్మేవాడు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్రాణాలు తీసేవాడు. అతనితో ఘర్షణ పడితే ప్రాణాలు పోయినట్లే. సొంత బావతోపాటు అనేక మంది పసి పిల్లలు, పని పిల్లల్ని తన ఇంట్లోనే కుటుంబీకులతో కలసి దారుణంగా చంపేశాడు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను స్వయంగా తీసుకువెళ్లే నయీమ్.. నిర్మానుష్య ప్రాంతాల్లో కాల్చేయడమో, శివార్లలో పూడ్చేయడమో చేసేవాడు.

అంత్యక్రియల కోసం మృతదేహాలను రవాణా చేసే సమయంలో మాత్రం తన వెంట 'గడాఫీ సైన్యాన్ని' తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో వారు కచ్చితంగా నల్లరంగు వస్త్రాల్లో ఉండాలని స్పష్టం చేసేవాడు. అక్క సలీమా బేగం రెండో భర్త నదీం, పని పిల్ల నస్రీన్‌లను అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంట్లో చంపిన నయీమ్.. నల్లవస్త్రాల్లో ఉన్న మహిళా అనుచరులతో వెళ్లి మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించాడని వెలుగులోకి వచ్చింది.

తనను తాను కాపాడుకోవడం నుంచి నేర సామ్రాజ్యం వైపు

మావోయిస్టు పార్టీలో చేరడం.. ఆ తర్వాత పోలీసులకు కోవర్ట్‌గా మారిన నయీమ్.. మావోయిస్టు నేత ఈదన్న హత్యతోపాటు ఇతర పరిణామాల నేపథ్యంలో ఉద్యమం నుంచి బయటకు వచ్చాడు. అనంతరం మావోయిస్టుల్ని అంతం చేస్తానంటూ ప్రకటించాడు. దీంతో అతడు మావోయిస్టులకు టార్గెట్‌గా మారాడు.

ఈ క్రమంలో తనను తాను కాపాడుకోవడంపైనే దృష్టిపెట్టాడు. అయితే, 2008 తర్వాతే నయీమ్ దృష్టి ధనార్జనపై పడింది. అప్పటికి రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తన అనుచరగణాన్ని పెంచుకుని, అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తూ.. అక్రమార్జనపైనే దృష్టి కేంద్రీకరించి సంపాదించడం ప్రారంభించాడు. నయీమ్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగేందుకు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తుండటం గమనార్హం. వారి సహకారంతోనే నయీమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+