తెలంగాణలో టిడిపిదే అధికారం!: నాయిని నర్సింహా రెడ్డి
రాష్ట్రానికి ఎవరు వచ్చినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే పరిపాలన చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతోంది.
హైదరాబాద్: రాష్ట్రానికి ఎవరు వచ్చినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే పరిపాలన చేస్తుందని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతోంది.
ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరు వచ్చినా ఏమీ కాదన్నారు.

మరో పదేళ్ల వరకు తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని, తెలుగుదేశమే పరిపాలన చేస్తుందని నాయిని వ్యాఖ్యానించారు. తర్వాత తప్పును సరిద్దుకున్న నాయిని తెలంగాణలో టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications