కేసీఆర్‌ను తిట్టినవారే క్యాబినెట్లో: వెనక్కి తగ్గిన మంత్రి నాయని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తిట్టినవాళ్లే మంత్రివర్గంలో ఉన్నారని తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి వివరణ ఇచ్చారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఆయనను తిట్టినవాళ్లు ఉన్నారనే ఉద్యమకారుల వ్యాఖ్యలపై మాత్రమే తాను స్పందించానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

 కెసిఆర్ తనకు అలా చెప్పలేదు..

కెసిఆర్ తనకు అలా చెప్పలేదు..

రాజ్యసభకు వెళ్లాలని కేసీఆర్ తనకు ఎప్పుడూ చెప్పలేదని మంత్రి నాయని నర్సింహా రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగానే తాను నడుచుకుంటానని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నాయని నర్సింహా రెడ్డి వివరణ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు.

 చెన్నారెడ్డి పాత్ర చాలా గొప్పది..

చెన్నారెడ్డి పాత్ర చాలా గొప్పది..

తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారని నాయని నర్సింహా రెడ్డి అన్నారు. చెన్నారెడ్డి జయంతి సభలో ఆయన శనివారంనాడు ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్ర చాలా గొప్పదని ఆయన అన్నారు.

 చెన్నారెడ్డి స్ఫూర్తితోనే కేసిఆర్..

చెన్నారెడ్డి స్ఫూర్తితోనే కేసిఆర్..

స్వరాష్ట్ర ఉద్యమాన్ని చెన్నారెడ్డి పతాక స్థాయికి తసుకుని వెళ్లారని, ఉద్యమాన్ని బలహీన పరచలేదని నాయని నర్సింహారెడ్డ అన్నారు. చెన్నారెడ్డ స్ఫూర్తితోనే కేసీఆర్ మలిదశలో ఉద్యమించారని ఆయన చెప్పారు. సోనియా హామీ మేరకు తెలంగాణ ఇచ్చారని చెప్పారు.

 చెన్నారెడ్డి కృషి ఎనలేనిది...

చెన్నారెడ్డి కృషి ఎనలేనిది...

ప్రత్యేక తెలంగాణ కోసం చెన్నారెడ్డి చేసిన కృ,షి ఎనలేనిదని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది చెన్నారెడ్డేనని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana home minister Nayini Narsimha Reddy clarified on his comments KCR's cabinet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి