Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ ను లోపలేయలేదనే- బీజేపీకి గుడ్ బైపై విజయశాంతి-ఇద్దరూ తోడు దొంగలే..!

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సీనియర్ నేత విజయశాంతి ఇవాళ దీనిపై స్పందించారు. బీజేపీని వీడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆమె వివరించారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరానని, పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని విజయశాంతి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోకి రాబడానికి కారణం బీజేపీ పెద్ద తప్పు చేసిందన్నారు.

ఉద్యమ నాయకురాలుగా , పార్లమెంట్ లో కొట్లాడిన తెలంగాణ నాయకురాలుగా ఉన్న తాను.. రాష్ట్రమే ముఖ్యమని 25 సంవత్సరాలు పనిచేసినట్లు విజయశాంతి తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ ను వీడి బీజేపీ కి వెళ్ళడానికి కారణం కేసీఆర్ అవినీతిపరుడని, లోపల వేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందన్నారు. కేసీఆర్ పై చర్యలు తోడుకుంటారన్న నమ్మకంతోనే బీజేపీ లో చేరినట్లు ఆమె వెల్లడించారు.

new congress joinee vijayashanti says resigned to bjp for not sending kcr into jail

కానీ నెలలు ,సంవత్సరాలు గడిచినా కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదని బీజేపీ పై ఆమె మండిపడ్డారు. మోడీ ,అమిత్ షా ,నడ్డా ని అడుగుతున్నా.. మీరు ఎప్పుడు తెలంగాణ కి వచ్చిన కేసీఆర్ అవినీతిపరుడు ,కుటుంబ పాలన అని చెప్పారని గుర్తుచేశారు.కేసీఆర్ అవినీతి పై ఆధారాలతో సహా వారి దగ్గర ఉన్నాయని, ఏటీఎం, కుటుంబ పాలన ,దొంగ అని వచ్చి చెప్తారన్నారు.కానీ ప్రధాని మోడీ.. ప్రధానిగా మీకు మెజారిటీ ఉందని, మీరు కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.
మీరు చర్యలు తీసుకోలేదని ఉద్యమకారులిగా అడుగుతున్నామన్నారు.

అందుకే బీజేపీ ,బీఆరెస్ ఒక్కటేనని విజయశాంతి ఆరోపించారు. తెర ముందు ఒకలా..తెర వెనుకాల ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు ,బీజేపీ కార్యకర్తలు , ఉద్యమకారులు పిచ్చోళ్ళు అయ్యారన్నారు. చివరి నిముషం వరకు యాక్షన్ తీసుకుంటారని చూసానని, అందుకే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానన్నారు. బీజేపీ లో ఉంటూ 4 నెలలుగా మౌనంగా ఉన్నానని, సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారని అడిగినట్లు విజయశాంతి తెలిపారు.
ఎన్నికలకు 4 నెలల ముందు అధ్యక్షుడిని మారిస్తే బీజేపీకి డిజాస్టర్ అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.అయినా మార్చారన్నారు.

బీజేపీ లో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటారని, ఆ నాయకుడు అధ్యక్షుడిని మార్చాలని పదే పదే చెప్పారని విజయశాంతి తెలిపాకరు. దీంతో అధిష్టానం అధ్యక్షుడిని మార్చిందన్నారు. ఆ వ్యక్తి మీద అసైన్ భూముల కేసు ఏమైందని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ చేజేతులా వారి పార్టీ వారే నాశనం చేసుకున్నారన్నారు. తెర ముందు ఒకలా తెర వెనుకాల ఒకలా ఒప్పందం కుదిర్చుకున్నారన్నారు. కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని, మెడిగడ్డ పిల్లర్లు కుంగిన ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఒప్పందం ప్రకారమే ఇవన్నీ చేసారా అని ప్రశ్నించారు. తనను తిట్టే హక్కు బీజేపీ , బీఆరెస్ లకి ఎక్కడిదన్నారు. తాను డబ్బు కోసం ,పదవుల కోసం లొంగే వ్యక్తిని కాదన్నారు.

తన మీద ఘాటైన హెడ్ఫింగ్స్ పెట్టించారని బీజేపీపై మండిపడ్డారు. తన గురువు అద్వానీ గారు విలువైన రాజకీయాలు చెప్పారు..కాని ఇప్పటి బీజేపీ నేతలకు ఇప్పుడు అలాంటి విలువలు లేవన్నారు. కొంతమంది లీడర్లు అసభ్యంగా మాట్లాడారు... వారు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని, బీజేపీ తనను మోస చేసిందని, తాను బీజేపీని మోసం చేయలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+