మెసేజ్ చివరలో T,S,P,G ఏ లెటర్ ఉన్నా.. క్లిక్ చేశారో మీ డబ్బు మాయం

రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ తో పాటు నేరాల తీరు కూడా మారుతూనే ఉంది. సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. కాస్త ఏమరుపాటుగా ఉన్న ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నిత్యం దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు, ఏమాత్రం అనుమానం రాకుండా ఖాతాలలో సొమ్ము కొల్లగొడుతున్నారు.

రోజుకో సైబర్ మోసం
ఇక తాజాగా మరో కొత్త సైబర్ మోసం వెలుగు చూసింది. ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.మీ మొబైల్ ఫోన్ కి మెసేజ్ లు వస్తున్నాయని, వస్తున్న మెసేజ్ చివరలో Tగాని, S గాని, P గాని, G గాని ఉంటే పొరపాటున కూడా ఆ లింక్స్ ను ఓపెన్ చేయకూడదని, ఒకవేళ ఓపెన్ చేస్తే మీ ఖాతాలను సొమ్ము మాయమవుతాయని చెబుతున్నారు.

new cyber frauds don t open these messages your bank accounts may be empty

అసలైన కంపెనీల పేరుతో మోసాలు
TRAI వారు చెప్పినట్టు Tఅంటే ట్రాన్సాక్షన్, Sఅంటే సర్వీస్, Pఅంటే ప్రమోషనల్ ,Gఅంటే గవర్నమెంట్ అని, ఇవి చూడడానికి నిజమైనవి గా కనిపించినప్పటికీ, వాటిని నమ్మకూడదని చెబుతున్నారు. అసలైన కంపెనీల పేరుతో కూడా వీరు ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తూ, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ఏదైనా లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఏ లింకు పడితే ఆ లింకు ఓపెన్ చేయకూడదని సూచిస్తున్నారు.

బాగా పెరుగుతున్న సైబర్ నేరాలతో జాగ్రత్త
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని నమ్మించి, తీరా ఓపెన్ చేసిన తర్వాత ఖాతాలను ఖాళీ చేసి పరార్ అవుతున్నారు. 2022 - 2023 సంవత్సరంలో ఈ నేరాలు మరింత పెరిగాయని, రోజు రోజుకి సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే మొబైల్ ఫోన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని, మెసేజ్ ల ద్వారా వచ్చే లింక్స్ ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+