అమావాస్య అయితే ఆ గ్రామంలో భయం భయం .. రక్తం తాగే ఆ వ్యక్తిని చూసి వణికిపోతున్న జనం

అమావాస్య వస్తుంది అంటే ఆ గ్రామంలో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో దిగులు పడుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత లో ఒక వ్యక్తి వింత ప్రవర్తన స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. అమావాస్య వచ్చిందంటే జంతువులను చంపి రక్తం తాగుతున్న వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడు అని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగ పేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు అనే వ్యక్తి వికృత చేష్టలు గ్రామస్తులను హడలెత్తిస్తున్నాయి. అమావాస్య వచ్చిందంటే చాలు రాత్రి సమయాల్లో తిరుగుతూ అర్ధరాత్రి వేళ గ్రామంలోని మేకలను గొర్రెలను ఎత్తుకెళ్లి, ఊరి శివార్లకు చేరుకొని అక్కడ వాటి గొంతు కొరికి చంపి రక్తం తాగుతుండడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీంతో అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు . ఇక జంతువులను తీసుకెళ్లి నోటితో కొరికి రక్తాన్ని తాగుతున్న ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయం అదే మేకపిల్లను భుజాన వేసుకొని గ్రామంలోకి వస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు 50 గొర్రెలకు పైగా బలయ్యాయి. జంతువుల గొంతు కొరికి రక్తాన్ని తాగుతున్న ఆ వ్యక్తి ప్రవర్తన చూసినవారు ఇలాగే మనుషులను చంపితే ఎలా అంటూ భయపడుతున్నారు.

 new moon days a man who drinks blood is trembling the villagers

మూడేళ్ల క్రితం వరకు అందరితో కలిసి మెలసి ఉండే రాజు ఒక్కసారిగా వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కనిపించిన మేక, గొర్రెపిల్లల గొంతుకోసి రక్తం తాగుతున్నాడు. అతని ప్రవర్తనతో తల్లిదండ్రులు అతనికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో అని ఆసుపత్రిలో సైతం చూపించారు. కానీ డాక్టర్ ఎలాంటి వ్యాధి లేదని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు.

ఇప్పటికి గ్రామంలోని 50 గొర్రెలను అతని గొంతు కొరికి చంపి వాటి రక్తం తాగాడు. ఇక గొర్రెల యజమానులకు తల్లిదండ్రులు నష్టపరిహారం చెల్లించలేక చేతులెత్తేసారు. ఇక రాజు సైతం తాను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అనేది తనకే తెలియదని చెప్తున్నాడు. ప్రతి అమావాస్యకు తనకు ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదని రాజు చెప్పాడు. అయితే గ్రామస్తులు మాత్రం వింతగా ప్రవర్తిస్తున్న రాజు తీరుతో గ్రామంలో ఉండాలంటేనే భయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+