తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రం తీపికబురు ఇచ్చింది. గత ఏడాది మంజూరు చేసిన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు తాజాగా విడుదల చేసింది.
ఈ పాఠశాలల్లో జూలై 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ప్రతి జిల్లాలో ఓ నవోదయ విద్యాలయాను ఏర్పాటు చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించి- ఏడు పాఠశాలలను రాష్ట్రానికి మంజూరు చేయించుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రతీ పాఠశాల రెసిడెన్షియల్ సౌకర్యంతో ఉంటుంది. ఆయా పాఠశాలల్లో విద్యార్ధుల ఎంపిక చేయడానికి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
కొత్తగా మంజూరైన ఏడు నవోదయ విద్యాలయాలపై విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ టీ గోపాల్ కృష్ణ, నవోదయ విద్యాలయ సమితి రీజినల్ అసిస్టెంట్ కమిషనర్లు, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఇందులో పాల్గొన్నారు.
ఆయా పాఠశాల భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని యోగితా రాణా ఆదేశించారు. సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. విద్యా ప్రణాళికలను రూపొందించాలని, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయంతో.. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు
పండగ వాతావరనంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభం కావాలని సూచించారు. పాఠశాలలు షెడ్యూల్ ప్రకారం కార్యకలాపాలు ప్రారంభిమని, ఎంపిక చేసిన విద్యార్థులకు పూర్తిగా రెసిడెన్షియల్ విద్యను అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.












Click it and Unblock the Notifications