ట్విస్ట్.. 4 ఏళ్లు కాదు: 'శిరీషని చంపేశారు.. సాక్ష్యాలు, రాజీవ్‌కు సంబంధం చూడమని..'
బ్యూటీషియన్ శిరీషను రాజీవ్, శ్రవణ్‌లు కలిసి చంపేశారని, అందుకు సాక్ష్యాలు ఉన్నాయని ఆమె బాబాయి శ్రీనివాస రావు మరోసారి అన్నారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీషను రాజీవ్, శ్రవణ్‌లు కలిసి చంపేశారని, అందుకు సాక్ష్యాలు ఉన్నాయని ఆమె బాబాయి శ్రీనివాస రావు మరోసారి అన్నారు. శిరీష నాలుగేళ్ల నుంచి ఆర్జే స్టూడియోలో పని చేయడం లేదని, నాలుగు నెలల క్రితమే జాయిన్ అయిందని బాబాయి ట్విస్ట్ ఇచ్చారు.
చదవండి: 'ప్లీజ్ వదలకు, ఏదో తేడా ఉంది': శిరీష, ఆ టైంలో ఏం జరిగింది?, రాజీవ్ అలా చేశాడా?
బెంగళూరు కేంద్రంగా పని చేసే సంస్థకు ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా శిరీష బ్యూటీషియన్ సేవలు అందించేదన్నారు. నాలుగైదు నెలల క్రితం రాజీవ్ పరిచయమయ్యాక, అక్కడ చేరిందన్నారు. తేజస్వినిపై పోలీసులు మొదటి నుంచి గోప్యంగా ఉంచుతున్నారన్నారు.

శిరీషపై అపవాదులు... మరి వీటికి జవాబేమిటి
శిరీష హుక్కా సేవించిందని, మద్యం తాగిందని, వారితో సంబంధం కలిగి ఉందని చెబుతూ మొదటి నుంచి ఆమె క్యారెక్టర్ పైన మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారని బాబాయి ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే శిరీష మద్యం తాగితే, హుక్కా సేవిస్తే పోస్టుమార్టం నివేదికలో అవి ఎందుకు బయటపడలేదో చెప్పాలని నిలదీశారు. పోలీసులు అబద్దాలు చెబుతున్నారనడానికి ఇది చాలన్నారు.

ఎవరినో కాపాడేందుకా? వారి కుట్రకు అంగీకరించకపోవడంతో..
ఈ కేసులో ఎవరినో కాపాడేందుకు అబద్దాలు చెబుతున్నారా అని బాబాయి అన్నారు. రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను మభ్యపెట్టి, కుక్కునూరుపల్లి తీసుకెళ్లారన్నారు. అక్కడ వారి కుట్రకు ఆమె అంగీకరించలేదని, అందుకే ఆమెను చిత్రహింసలకు గురి చేశారన్నారు. కారు దిగి పారిపోతూ ఆమె సెల్‌ఫోన్‌లో తన భర్తకు లొకేషన్ షేర్ చేస్తుండగా, ఆ సెల్‌ఫోన్ లైటింగ్ ఆధారంగా ఆమెను గుర్తించి, ఆమె దగ్గరకు చేరుకుని, జుట్టు పట్టుకుని కొట్టి హతమార్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఆర్జే స్టూడియోకి తీసుకొచ్చి ఆత్మహత్య డ్రామా ఆడుతున్నారన్నారు. దీనికి కూడా సాక్ష్యాలు ఉన్నాయన్నారు.

సీసీ కెమెరాలు ఏవీ పని చేయడం లేదు ఆశ్చర్యం
కేవలం శిరీష హత్య జరిగిన రోజే ఆర్జే స్టూడియో సీసీ కెమెరాలు పని చెయ్యలేదని, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు పని చెయ్యలేదని, ఆఖరుకి ఆర్జే స్టూడియో ఉన్న అపార్టుమెంట్ సెల్లార్‌లోని కెమెరాలు కూడా పని చెయ్యలేదని పోలీసులు చెబుతున్నారని బాబాయి అన్నారు. అలాగే, హైదరాబాద్‌కు సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల పుటేజ్ పోలీసులకు లభ్యమవ్వకపోవడం ఆశ్చర్యకరమన్నారు.

రాజీవ్ - తేజస్వినిల పెళ్లిని శిరీష ఎందుకు అడ్డుకుంటుంది?
శిరీష కేసులో పోలీసులతో పాటు కొన్ని మీడియా సంస్థలు చెబుతున్న కథనాలు మేక - కుక్క కథను తలపిస్తున్నాయని శిరీష పిన్ని అన్నారు. మేకను తీసుకు వెళ్తున్న ఓ గురువుతో అదేంటీ.. కుక్కను తీసుకు పోతున్నారని వరుసగా కొందరు చెప్పడంతో... తాను నిజంగా కుక్కను తీసుకు వెళ్తున్నానని భావించి అతను మేకను వదిలేశాడు. ఇప్పుడు శిరీష కేసులో కొందరి తీరు అలా ఉందన్నారు.

రాజీవ్‌కు సంబంధం చూడమని చెప్పింది
ఆర్జే స్టూడియోలో శిరీష నాలుగేళ్ల నుంచి పని చేయడం లేదని, నాలుగు నెలల ముందు జాయిన్ అయ్యారన్నారు. రాజీవ్ - శిరీషలు పెళ్లి చేసుకుంటే శిరీష ఎందుకు అడ్డుకుంటుందని నిలదీశారు. అదే నిజమైతే రాజీవ్‌కు సంబంధం చూడమని తమకు ఎందుకు చెప్పిందన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications