వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకే ఎపిసోడ్ తో బీజేపీకి కొత్తఆయుధం: టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై మొదలైన మాటలదాడి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ తో కలిసి పని చేయడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఐప్యాక్ సంస్థతో కుదిరిన ఒప్పందం, మరో పక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయటానికి ప్రయత్నాలు చేస్తున్న పీకే వ్యూహాలు వెరసి బిజెపికి పెద్ద ఆయుధం దొరికినట్లయింది.

పీకే ఎపిసోడ్ తో టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఎండగట్టే ప్రయత్నంలో బీజేపీ

పీకే ఎపిసోడ్ తో టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఎండగట్టే ప్రయత్నంలో బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని బిజెపి నేతలు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగిన భేటీ, ఆ తర్వాత చోటు చేసుకున్న ప్రకటనలు, ఇక తాజాగా ప్రశాంత్ కిషోర్, సోనియాగాంధీ మధ్య భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య త్వరలో పొత్తుకు అవకాశం ఉందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఇదే విషయాన్ని బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి టిఆర్ఎస్, కాంగ్రెస్ లను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు

టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు

వచ్చే ఎన్నికలలో, టిఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి పై బిజెపి పోటీ చేయనుందని బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ఆయన తేల్చి చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు పెట్టుకున్నట్టు తమకు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. 1ప్లస్ 1.. 0 గా మారుతుందని తాను కచ్చితంగా నమ్ముతున్నానని కృష్ణసాగర్ రావు తెలిపారు. అవినీతి, అవకాశవాద కూటమిని ప్రజలు తిరస్కరిస్తారని బీజేపీ నేత కృష్ణ సాగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అంటూ ప్రశ్నించిన బీజేపీ నేత

రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అంటూ ప్రశ్నించిన బీజేపీ నేత

ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న కృష్ణ సాగర్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు అని ప్రశ్నించిన కృష్ణ సాగర్ రావు రానున్న రోజులలో టిఆర్ఎస్ పార్టీతో జత కట్టడం కోసం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సహకరిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ బహుళ పార్టీలు, సిద్ధాంతాల దీర్ఘకాల సరసుడు అంటూ కృష్ణసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ను ఒక అస్థిరమైన అంశంగా పేర్కొన్న ఆయన, పీకే ఏదైనా ఒక భావజాలానికి విధేయుడుగా ఉండటం అసాధ్యం అంటూ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రత్యామ్నయం బీజేపీనే .. అంటూ ప్రజా క్షేత్రంలోకి

టీఆర్ఎస్ ప్రత్యామ్నయం బీజేపీనే .. అంటూ ప్రజా క్షేత్రంలోకి


2024లో భారత ప్రతిపక్ష పార్టీల అజెండాకు ప్రశాంత్ కిషోర్ తోనే ఎండ్ కార్డు పడుతుందని పేర్కొన్నారు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి వచ్చే ఎన్నికల్లో సమరానికి సిద్ధమైందని బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు వెల్లడించారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వం ఏం అని తేల్చి చెప్పిన ఆయన, ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ నేపథ్యంలోనే కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీల పొత్తు దాదాపు ఖరారైందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

English summary
The BJP seems to have found a new weapon with the PK episode. BJP leaders have started targeting the TRS-Congress alliance targeting Revanth Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X