తెలంగాణకు విముక్తి లభించినట్టేనా? శరవేగంగా తగ్గుతోన్న పేషెంట్ల సంఖ్య: 15 వేలకు దిగువగా

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ముప్పు నుంచి తెలంగాణకు విముక్తి లభించినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా క్షీణిస్తోంది. ప్రస్తుతం 15 వేలకు దిగువగా కొనసాగుతోంది. రోజురోజుకూ ఈ సంఖ్య మరింత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులు సంఖ్య వెయ్యికి మించకపోవడం, డిశ్చార్జీలు రెట్టింపు సంఖ్యలో నమోదవుతుండటం వల్ల చికిత్స పొందుతోన్న పేషెంట్లు గణనీయంగా తగ్గుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకొద్దిరోజులు కొనసాగితే.. యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు దిగువగా చేరుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 952 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 1,602 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 60వేలకు చేరువైంది. 2,58,828కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,43,686గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1410కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 13,732గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 11,313 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Newly 952 Covid19 positive cases and 3 deaths reported in Telangana last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-15, భద్రాద్రి కొత్తగూడెం-71, జగిత్యాల-26, జనగామ-8, జయశంకర్ భూపాలపల్లి-12, జోగుళాంబ గద్వాల-8, కామారెడ్డి-24, కరీంనగర్-35, ఖమ్మం-41, కొమరంభీమ్ ఆసిఫాబాద్-11, మహబూబ్ నగర్-15, మహబూబాబాద్-14, మంచిర్యాల-33, మెదక్-16, మేడ్చల్ మల్కాజ్‌గిరి-77, ములుగు-19, నాగర్ కర్నూలు-16, నల్లగొండ-45, నారాయణపేట్-1, నిర్మల్-14, నిజామాబాద్-23, పెద్దపల్లి-29, రాజన్న సిరిసిల్ల-19, రంగారెడ్డి-68, సంగారెడ్డి-20, సిద్ధిపేట్-23, సూర్యాపేట్-32, వికారాబాాద్-6, వనపర్తి-6, వరంగల్ రూరల్-13, వరంగల్ అర్బన్-44, యాదాద్రి భువనగిరి-18 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Telangana's 'Dharani' Portal: Non-Agricultural Lands Registration to begin Nov 23 | Oneindia Telugu

    తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 38,245 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 49,29,974కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకూ 1,32,454 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+