వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తగా పెళ్ళైన నవ దంపతుల ఉసురు తీసిన గీజర్.. అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

విధిరాతను ఎవరూ మార్చలేరు అంటారు. విధి ఆడిన వింత ఆటలో అందరం పావులమే అని చెబుతూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సందర్భాలలో ఈ మాటలను కచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. తాజాగా ఈ మాటలకు సరిగ్గ్గా సరిపోయే విషాద ఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న నవ దంపతులు, ఊహించని ఘటనతో కానరాని లోకాలకు చేరిపోయారు. బాత్రూమ్ లో గీజర్ పేలటంతో నవ దంపతులు మృతి చెందారు. హైదరాబాదులోని లంగర్ హౌస్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..

డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్‌మెంట్...వికటించిన వైద్యం-అసలేమైందంటే..?డెంగ్యూ రోగికి బత్తాయి ట్రీట్‌మెంట్...వికటించిన వైద్యం-అసలేమైందంటే..?

భార్యా భర్తల ప్రాణాలు తీసిన గీజర్

భార్యా భర్తల ప్రాణాలు తీసిన గీజర్


హైదరాబాద్లోని ఖాదర్ బాగ్ కు చెందిన సయ్యద్ నిసారుద్దీన్ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య సైమా ఎం బి బి ఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల వివాహం చేసుకున్న ఈ దంపతులిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. జీవితం మీద ఎన్నో ఆశలు, కొత్త కాపురంలో ఎన్నో మధురానుభూతులతో సాగుతున్న వారిపై విధి గీజర్ రూపంలో కాటు వేసింది. భార్యా భర్తల ఉసురు తీసింది.

గీజర్ పేలి నవ దంపతులు మృతి

గీజర్ పేలి నవ దంపతులు మృతి


ఈ రోజు ఊహించని విధంగా తమ ఇంట్లో ఉన్న గీజర్ పేలడంతో ఇద్దరూ కరెంట్ షాక్ తో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇంట్లో వారిద్దరూ తప్ప ఇంకా ఎవరూ లేకపోవటంతో ఘటన జరిగిన వెంటనే ఎవరికీ తెలియలేదు. ఇక ప్రతి రోజులానే వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేయడంతో వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూశారు. దీంతో వారిద్దరు బాత్రూమ్ వద్ద విగతజీవులుగా కనిపించారు. వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు.

కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు

కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు


అయితే అప్పటికే వైద్యులు వారు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటీవలే వీరిద్దరికి వివాహం జరిగిందని, ఇంతలోనే దారుణం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన నవదంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రమాదం జరిగింది అనేది పరిశీలిస్తున్నారు. గీజర్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. స్నానం చేసే సమయంలో ముందుగానే గీజర్ ఆఫ్ చేసుకోవటం మంచిదని చెప్తున్నారు.

English summary
Syed Nisaruddin and his wife Saima, a newly married couple from Khader Bagh, Hyderabad, were died with current shock in a geyser blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X