తెలంగాణ నుంచి వచ్చే వారం మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్: ఎక్కడ్నుంచి ఎక్కడికంటే?

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. హైదరాబాద్ - బెంగళూరును కలిపే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగస్టు 25న పట్టాల ఎక్కేందుకు సిద్ధమవుతోందని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించాయి.

సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడిచే ప్రస్తుత రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలా కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరుతుంది. కాగా, ఈ హై-స్పీడ్ సర్వీస్ భారతదేశంలోని రెండు ప్రముఖ ఐటీ హబ్‌లు హైదరాబాద్ - బెంగుళూరు మధ్య కీలకమైన మార్గాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్రపోషించనుంది.

vande bharat express

కాచిగూడ- యశ్వంత్‌పూర్ రూట్‌లో ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు కర్నూల్ మీదుగా ప్రయాణిస్తుంది. తొలుత రాయిచూర్ మార్గంలో వెళ్తుందని అంతా భావించినప్పటికీ.. కర్నూల్ మీదుగా నడపాలని నిర్ణయించారు. వచ్చే వారంలోనే ప్రారంభం కానున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు స్టాప్స్ కూడా నిర్ణయించారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్, ఢోన్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో నిలిపే విషయంలో ఇంకా నిర్ణయం కాలేదు.

కాగా, హైదరాబాద్‌కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేడం, రాయచూర్ జంక్షన్, గుంతకల్ జంక్షన్‌లో షెడ్యూల్ ప్రకారం స్టాప్‌లు వేయాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ - బెంగళూరు మధ్య కనెక్టివిటీని మెరుగుడనుంది. ఈ రైలు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ - బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ మధ్య నడుస్తుంది.

కాగా, ఈ ఏడాది జనవరి 15 హైదరాబాద్‌కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది సికింద్రాబాద్ - విశాఖపట్నంలను కలుపుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవలందిస్తున్న మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. రైలు సామర్లకోట్ జంక్షన్, రాజమండ్రి, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్ వంటి కీలక స్టేషన్లలో ఆగతోంది.

రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును హైదరాబాద్‌లో ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రైలు సికింద్రాబాద్‌ను హైదరాబాద్- తిరుపతిలో కలుపుతుంది. కేవలం 8 గంటల 15 నిమిషాల్లో 662 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది సగటున గంటకు 80 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+