హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాల కలకలం; వారితో ఆ సంబంధాలే కారణం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు, హనుమకొండ జిల్లాలోనూ, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. దీంతో తాజాగా ఎన్ఐఏ సోదాలు వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మునుగోడు ఉపఎన్నికపై గురిపెట్టిన కేసీఆర్ ; 100మందితో భారీ స్కెచ్.. వ్యూహమిలా!!మునుగోడు ఉపఎన్నికపై గురిపెట్టిన కేసీఆర్ ; 100మందితో భారీ స్కెచ్.. వ్యూహమిలా!!

హన్మకొండలో ఎన్ఐఏ సోదాలు

హన్మకొండలో ఎన్ఐఏ సోదాలు

హన్మకొండలోని హంటర్ రోడ్డు లోచైతన్య మహిళా సంఘం నేత,సామాజిక కార్యకర్త అయిన అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అనిత ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గత మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి అనిత ఇంట్లో తనిఖీలు జరుపుతున్నారు. ఇక ఈ సోదాలకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.

 హైదరాబాద్ లోనూ ఎన్ఐఏ తనిఖీలు

హైదరాబాద్ లోనూ ఎన్ఐఏ తనిఖీలు


ఇదే సమయంలో హైదరాబాదులోని విద్యానగర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ అధికారులు చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలను చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకూ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. చాలా గోప్యంగా ఈ తనిఖీల వ్యవహారాన్ని ఉంచారు.

గతంలోనూ మావోయిస్ట్ లకు సహకరిస్తున్నారని ఏపీలో పలువురిపై ఎన్ఐఏ దాడులు

గతంలోనూ మావోయిస్ట్ లకు సహకరిస్తున్నారని ఏపీలో పలువురిపై ఎన్ఐఏ దాడులు


ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీ నేతలకు చెక్ పెట్టడం కోసం రంగంలోకి దిగిన ఎన్ఐఏ మావోయిస్టులను పట్టిస్తే భారీగా నజరానాలు ఇస్తామని ప్రకటించి, దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారిపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు సహకరిస్తున్నారు అన్నఅనుమానంతో కొంతమంది ఇళ్లపై గతంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది.

తాజాగా చైతన్య మహిళా సంఘం నేతలతో మావోలకు సంబంధాలపై నజర్

తాజాగా చైతన్య మహిళా సంఘం నేతలతో మావోలకు సంబంధాలపై నజర్


ఏకకాలంలో దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కళ్యాణ్ రామ్, విరసం కార్యకర్త దొడ్డి ప్రభాకర్ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులతో వారికి సంబంధాలు ఉన్నాయన్న కారణంతో, మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంతో వారి వద్ద నుండి కూపీ లాగే ప్రయత్నం చేసింది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఎన్ఐఏ అధికారులు చైతన్య మహిళా సంఘం నేతలకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని అనుమానంతో వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారు.

English summary
In Telangana state, along with Hanmakonda, NIA searches continue in many areas. It is known that the connection with Maoists was the reason for the NIA raids
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X