Naveen Case: సంచలన విషయాలు వెల్లడించిన నిహారిక..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న నిహారిక రెడ్డి సంచలన విషయాలు చెప్పింది. ఆమె పోలీసుల కస్టడీలో విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. ఇంటర్ లోనే నవీతో ప్రేమలో పడ్డట్లు నిహారిక తెలిపింది. నవీన్, తాను ఇంట్లో ఎవరు లేనప్పుడు చాలాసార్లు కలుసుకునేవాళ్లమని చెప్పింది.
హరిహరకృష్ణ ప్రపోజ్
నవీన్ తో గొడవ పడినప్పుడల్లా హరిహరకృష్ణ సర్ది చెప్పేవాడని నిహారిక వివరించింది. నవీన్ వేరే అమ్మాయితో తిరుగుతుండడంతో అతనితో దూరంగా ఉన్నట్లు చెప్పింది. ఈ విషయం హరిహరకు తెలిసి అతను తనకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించింది. హరిహరకృష్ణ ప్రపోసల్ కు ఒకే చెప్పినట్లు పేర్కొంది. అయితే నవీన్ ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాడని.. ఈ విషయాన్ని హరిహరకు చెప్పినట్లు పోలీసులు తెలిపింది. ఇది నచ్చని హరిహరకృష్ణ నవీన్ హత్య చేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తానని చెప్పేవాడని వివరించింది. అతను సరదాగా అంటున్నాడని అనుకున్నట్లు నిహారిక చెప్పింది.
గెట్ గెటుగెదర్ పార్టీ
కొద్ది రోజుల తర్వాత హరిహర తనను వారి ఇంటికి తీసుకెళ్లాడని.. అక్కడు నవీన్ చంపడానికి కొన్న కత్తి, రెండు జతల గ్లౌజ్ లు చూపించాడని పేర్కొంది. అలా చేస్తే జైలుకు వెళ్తావని తను హెచ్చరించినట్లు నిహారిక చెప్పింది. జనవరి 15 కృష్ణ తనకు ఫోన్ చేశాడని 16న నవీన్ గెట్ గెటుగెదర్ పార్టీకి హైదరాబాద్ వస్తున్నాడని చెప్పినట్లు తెలిపింది. కానీ ఆ పార్టీ రద్దు అయినట్లు చెప్పాడని పేర్కొంది.

నవీన్ ఫిబ్రవరి 17న హైదరాబాద్ వస్తున్నట్లు తనకు మెసేజ్ చేశాడని నిహారిక చెప్పింది. ఆ వెంటనే హరిహర ఫోన్ చేసి నవీన్ వస్తున్నట్లు చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. నవీన్ ఫోన్ చేస్తే వేరే అబ్బాయితో రిలేషన్ ఉన్నానని చెప్పాలన్నాడని పేర్కొంది. ఆ తర్వాత నవీన్ ఫోన్ చేయగా.. వేరే అబ్బాయితో రిలేషన్ ఉన్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసినట్లు నిహారిక వివరించింది.
రూ. 1500
"ఫిబ్రవరి 18న ఉదయం కృష్ణ తనను కలవాలని మెసేజ్ చేశాడు. శివరాత్రి ఉదయం వనస్థలిపురం నాగార్జున పాఠశాల పక్క గల్లీలో హరిహరకృష్ణను కలిశాను. అప్పుడే నవీన్ హత్య చేసిన హరి చెప్పాడు. నవీన్ అవయవాలను వేరే చోట పడేసినట్లు చెప్పాడు. వరంగల్ వెళ్లడానికి హరి డబ్బు కావాలని అడిగితే రూ. 1500 ఇచ్చాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాను" అని నిహారిక పోలీసులకు చెప్పింది.

ఫిబ్రవరి 20న ఎల్బీనగర్ బస్టాప్ వద్ద హరి తననను కలిసినట్లు నిహారిక చెప్పింది. నవీన్ చంపిన ప్లేస్, అతని తల పడేసిన చోటును చూపిస్తానని బైక్ పైతీసుకెళ్లినట్ల పేర్కొంది. బిఎన్ రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ వద్ద హరి బట్టలు పడేసినట్లు చూపించాడని వివరించింది. బ్రహ్మణపల్లి వద్ద నవీన్ తల, కత్తి, సెల్ ఫోన్ పడేసిన చోటును చూపించినట్లు నిహారిక పోలీసులకు వివరించింది.
డాబాలో బిర్యానీ
అదే రోజు సాయంత్రం అబ్దుల్లా పూర్ మెట్ లోని ఓ డాబాలో బిర్యానీ తిన్నట్లు చెప్పింది. ఆ తర్వాత నవీన్ హత్య చేసిన ప్రాంతం ఇదేనని చెప్పి ఇంటి దగ్గర తనను దింపేసి హరి వెళ్లిపోయినట్లు నిహారిక వివరించింది.
"ఆ తర్వాత నవీన్ స్నేహుతులు, మేనమాన నుంచి నాకు చాలా ఫోన్లు వచ్చాయి. నవీన్ గురించి నాకు తెలియదు అని సమాధానం చెప్పా. ఫిబ్రవరి23న హరి అక్క, బావ హరి కనిపించడం లేదని స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఆ విషయం హసన్ నాకు ఫోన్ చేసి చెప్పుడు. ఫోన్ లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చేయాలని కోరగా.. నేను డిలీట్ చేశాను. ఫిబ్రవరి 24న హరి హసన్ ఇన్ స్టా నుంచి నా ఫ్రెడ్ కు మెసేజ్ చేశాడు. ఎవరికి ఫోన్ చెయ్యొద్దని మెసేజ్ చేశాడు" అని నిహారిక చెప్పింది.

అదే రోజు తాను హరిహరకృష్ణను కలిసినట్లు నిహారిక తెలిపింది. పోలీసులకు లొంగిపోతానని హరి చెప్పాడని తెలిపింది. హరి తాను తన బావ అడ్వకేట్ భూపాల్ రెడ్డి జరిగిన విషయం చెప్పగా.. ఆయన పోలీస్టేషన్ లొంగిపోవాలని హరిహరకృష్ణకు సూచించినట్లు నిహారిక పోలీసులకు వెల్లడించింది.












Click it and Unblock the Notifications