ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగ విజయోత్సవ సభ.. ఎందుకంటే!!
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలంగా పాలన సాగించిన బీఆర్ఎస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కాగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడంలో నిరుద్యోగ యువత పాత్ర చాలా ఉందని తెలుస్తుంది. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేశారు అన్నదానిపై ఎంతోమంది నిరుద్యోగ యువత రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ బస్సు యాత్రల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేశారు.
10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న కేసీఆర్ తాను ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయలేదని, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, నోటిఫికేషన్లు రద్దు చేయడం, ప్రశ్నించిన నిరుద్యోగుల అరెస్టులు, నోటిఫికేషన్లు సరిగ్గా ఇవ్వకపోవటంతో కోర్టులో కేసులు దాఖలు చేయటం వంటి అనేక అంశాలపై నిరుద్యోగ యువత కేసీఆర్ ను టార్గెట్ చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.

మొత్తం 119 నియోజకవర్గాలలో గ్రామ గ్రామాన పర్యటించిన నిరుద్యోగ యువత నిరుద్యోగుల బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రత్యేకంగా ప్రచారం చేసింది. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న ప్రజా వ్యతిరేకతతో పాటు, నిరుద్యోగులు కూడా విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం, గ్రామీణ ప్రాంతాలలో కి వెళ్లి అక్కడ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో, ఈ ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీకి లాభించాయి.
ఫలితంగా కేసీఆర్ పార్టీ ఓటమి, కాంగ్రెస్ విజయం సాధ్యమైంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో నిరుద్యోగ జేఏసీ ఇప్పుడు ఈ ఎన్నికల విజయాన్ని నిరుద్యోగుల విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈనెల 30 తేదీన భారీ ఎత్తున విజయోత్సవ సభను నిర్వహించనున్నారు.
ఈ సభ ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల యొక్క కీలక భూమికను తెలిపి, ప్రభుత్వం ముందు నిరుద్యోగ జేఏసీ తమ డిమాండ్స్ ను పెట్టనున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ విజయోత్సవ సభ వేదికగా ఏం జరగబోతుంది? సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల నుండి ఎటువంటి విజ్ఞప్తులు రాబోతున్నాయి? అన్నది తెలియాల్సి ఉంది.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications