Nita ambani సెంటిమెంట్: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని.. ఆపై!!
అపర కుబేరుడు, భారతదేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రి అమ్మవార్లను దర్శించుకున్న నీతా అంబానీ ఆలయాల్లో సుమారు 15 నిమిషాల పాటు గడిపారు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ హైదరాబాద్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చారు. మొదటి నుంచి దైవభక్తి మెండుగా ఉన్న నీతా అంబానీ నిన్న రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్నా బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవడం ఆమెకు సెంటిమెంట్ గా చెబుతారు.

ఈ క్రమంలోనే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీ ఆలయంలోనే 15 నిమిషాల పాటు గడిపారు. అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. ఆలయ ఈవో కుంట నాగరాజు, చైర్మన్ కొత్తపల్లి సాయిబాబా గౌడ్ నీతా అంబానీ కి స్వాగతం పలికారు. ఆలయంలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, అద్దాల మండపాన్ని దర్శించుకున్న నీతా అంబానీకి వారు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
బల్కంపేట ఆలయంలో ముంబై ఇండియన్స్ అధినేత్రి నీతా అంబానీ పూజలు చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బల్కంపేట ఎల్లమ్మ దయతో మ్యాచ్ ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూడటానికి వచ్చిన నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ లను దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications