ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ (ఫోటోలు)

హైదరాబాద్: బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఎదురుగా వస్తున్న బస్సును ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా ఆరుగురు మృతి చెందగా, టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా నవీపేట్‌ మండలం ఫకీరాబాద్‌ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న బండి సత్యనారాయణ (28), సాత్విక్‌ (1), రాంపూర్‌ గణేశ్‌ (33), గంగోత్రి (5), నితీశ్‌ (17), రుచిత (14) మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో గాయపడిన రచన అనే గర్భిణీ తీవ్రగాయాలతో హైదరాబాద్‌ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య మృత్యువతో పోరాడుతోంది.

మృతులంతా దగ్గరి బంధువులే కావడం విశేషం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను నిజామాబాద్ జిల్లా ఆదర్శనగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

 ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ


వీరంతా బాసర నుంచి నిజామాబాద్ వైపు ఆటోలో వస్తుండగా బస్సు ఢీకొట్టింది. భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి భైంసా వెళ్తుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణిని జేసీ రవీందర్ రెడ్డి పరామర్శించారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

 ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ

గాయపడిన గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

 ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ


మరోవైపు అదే జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్‌ గ్రామానికి చెందిన రైతులు చెన్నబోయిన పోశయ్య (60), రొడ్డ పోశయ్య (62)లు రుణమాఫీ చేసుకొని, కొత్తరుణం పొందేందుకు పహాణీలు తీసుకొని బ్యాంకుకు బయల్దేరారు. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై వెళుతున్న వారిని, ఇసుక లారీ వేగంగా ఢీకొట్టింది.

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ

ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, చావుబతుకుల్లో గర్భిణీ


ఈ ప్రమాదంలో లారీ టైర్లు వారి పైనుంచి వెళ్లిపోయాయి. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లింగంపల్లి క్రాస్‌రోడ్‌ వద్ద రోడ్డును దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీని అక్కడే వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+