ఇక్కడ బీజేపీ ఆటలు సాగవు; ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై విరుచుకుపడిన తెలంగాణా మంత్రులు

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి కుట్రలకు పాల్పడుతోందని తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. ప్రలోభాలకు తెలంగాణ సమాజం లొంగేది కాదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్ గౌడ్ బిజెపి కుట్రలపై నిప్పులు చెరిగారు.

ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ .. మండిపడిన మంత్రులు

ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ .. మండిపడిన మంత్రులు

హైదరాబాద్లో పోలీసుల భారీ ఆపరేషన్ తెలంగాణలో రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం బేరసారాలు కొనసాగాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదు తో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, నందకుమార్, తిరుపతి లను పోలీసులు పూర్తి సాక్ష్యాలతో పట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఫిరాయింపుల కోసం వారితో బేరసారాలు ఆడుతుండగా పట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ పై టీఆర్ఎస్ మంత్రులు మండిపడుతున్నారు.

బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి ఎర్రబెల్లి


అధికార దాహంతో అహంకారంతో బీజేపీ ఇలాంటి పనులకు పాల్పడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యంతో పరిహాసం చేస్తుందన్నారు. ధన స్వామ్యం తో కొనుగోళ్ల పర్వం కొనసాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టం చేశారు. బీజేపీ ప్రలోభాలకు టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు లొంగరని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

కెసిఆర్ కు ఆదరణ పెరుగుతుందనేఈ కుతంత్రం

కెసిఆర్ కు ఆదరణ పెరుగుతుందనేఈ కుతంత్రం


బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు అభినందనలు అంటూ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించ వద్దు అంటూ మంత్రి ఎర్రబెల్లి బీజేపీ శ్రేణులకు హితవు పలికారు. బి అర్ ఎస్ తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయంతోనే బీజేపీ ఈ తరహా కొనుగోళ్ళ కుట్రలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. కెసిఆర్ కు ఆదరణ పెరుగుతుందనేఈ కుతంత్రం చేస్తున్నారన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కొట్లాడైనా కాపాడుకుంటాం అని స్పష్టం చేశారు. ఇక బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చి చెప్పారు.

 మునుగోడులో ఓటమి భయంతోనే ఇదంతా: మంత్రులు

మునుగోడులో ఓటమి భయంతోనే ఇదంతా: మంత్రులు


మునుగోడు లో ఓటమి భయంతోనే టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బిజెపి నాయకత్వం ప్రలోభాలకు గురి చేస్తుందని గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బిజెపికి మునుగోడులో ఓటమి తప్పదని వారు తెలిపారు. బిజెపి చేసే కుట్రలకు తెలంగాణలో చోటు లేదని పేర్కొన్న మంత్రులు, తెలంగాణలో బిజెపి ఆటలు సాగవు అంటూ స్పష్టం చేశారు. బిజెపి బిజెపి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై బిజెపి దిష్టిబొమ్మను దహనం చేశారు.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+