పాతవారికి నో ఛాన్స్: జనసేన సంచలనం, షాకింగ్ ప్రకటన! వారికి నిరాశ

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వస్తే, పరిస్థితిని చూసి జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ఇతర పార్టీలలో పలువురు నేతలు కాచుకొని కూచున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో టిక్కెట్లు రావని తెలిసినా, మరో కారణమైనా పలువురు నేతలు పవన్ వైపు చూస్తున్నారు.

'జగన్ ముద్దు ఇస్తాడని 40 ఏళ్ల లోపు మహిళలు పారిపోతున్నారు, అందుకే పనికొచ్చాం'

ఆశించే వారికి ఇది షాకింగ్ వార్త

ఆశించే వారికి ఇది షాకింగ్ వార్త

అయితే, అలా పక్క చూపులు చూస్తున్న వారికి జనసేన పార్టీ గట్టి షాకిచ్చింది. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిస్థితి చూసి ఇతర పార్టీల నుంచి వస్తామని భావించే వారికి ఇది షాకింగ్.

కొత్త వారికి మాత్రమే ఛాన్స్, వారికి ఇస్తే

కొత్త వారికి మాత్రమే ఛాన్స్, వారికి ఇస్తే

ఆయన కాకినాడలో మాట్లాడారు. జనసేనలో కొత్త వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారికి అవకాశం ఇస్తే మూసధోరణిలో ఉంటాయని భావించి వారికి ఇవ్వడం లేదని ఆశ్చర్యకర ప్రకటన చేశారు.

848 మందిని ఎంపిక చేశాం

848 మందిని ఎంపిక చేశాం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 42 లోకసభ స్థానాల పరిధఇలో 848 మందిని ఎంపిక చేశామని, డిసెంబర్ నాటికి వీరికి శిక్షణ పూర్తవుతుందని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండలస్థాయి కమిటీలను రెండు విడతలుగా ఏర్పాటు చేస్తామన్నారు.

వారికి నిరాశేనా

వారికి నిరాశేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు నేతలు కలిశారు. ఇటీవల నెల్లూరుకు చెందిన వైసిపి ఎమ్మెల్యే కలిశారు. అలాగే, మరికొందరు నేతలు పవన్ వైపు చూస్తున్నారు. వీరికి ఇది నిరాశ కలిగించే విషయమే అంటున్నారు. దీనిని 2019 ఎన్నికల్లో అమలుపరిస్తే అది సంచలనం అవుతుందని చెప్పవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena leader said that there is mo chance to old political leaders in Jana Sena for tickets.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి