హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'నో ఎంట్రీ': ప్రైవేట్ బస్సులపై కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులకు నగరంలోకి ఎంట్రీని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీఏ అధికారులు చర్యలు కూడా ప్రారంభించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇకనుంచి నగరంలోకి రావడం నిషేధమని, వాటి యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు.

No Entry for Private Travel Buses in hyderabad

నిబంధనలను బేఖాతరు చేసి నగరంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బస్సులను సీజ్ చేయడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇప్పటివరకు.. ఉదయం 8 గంటలలోపు, రాత్రి 9 గంటల తరువాత ప్రైవేట్ ట్రావెల్ బస్సులను నగరంలోకి అనుమతిస్తూ వచ్చారు. ఇకనుంచి అందుకు అవకాశం లేదు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నగర శివారు ప్రాంతాల నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

English summary
Telangana govermnet strictly ordered to RTA to not allow private travels in to Hyderabad. Recently goverment issued orders regarding this
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X