హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా ; 31 స్థానాలకు బ్రేక్ ,ఈసీ షాక్ : దీదీ కోటలో ఉప ఎన్నికల నగారా !!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కు లైన్ క్లియర్ అవుతుంది అనుకుంటే ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. కరోనా మహమ్మారి సాకుగా చూపి హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా వేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేలు నియోజకవర్గానికి జరగవలసిన ఉప ఎన్నిక కూడా వాయిదా పడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా ఎన్నికలకు దిగాలని రంగం సిద్ధం చేసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పట్లో ఉపఎన్నిక లేదని చెప్పి ఏపీకి కూడా షాక్ ఇచ్చింది.

 హుజూరాబాద్ రాజకీయ వర్గాలకు షాక్ .. ఉప ఎన్నికకు బ్రేక్

హుజూరాబాద్ రాజకీయ వర్గాలకు షాక్ .. ఉప ఎన్నికకు బ్రేక్


సెప్టెంబర్ నెలలో హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని పెద్ద ఎత్తున కసరత్తు చేసిన రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మూడు స్థానాలకు, ఒడిశాలో ఒక స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తామని వెల్లడించిన వేళ హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహిస్తారని, అక్టోబర్ 3వ తేదీన లెక్కింపు ప్రక్రియ చేపడతారని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పై స్పందించిన ఈసీ దసరా తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. పండుగల సీజన్ ముగిసిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక బద్వేలు ఉప ఎన్నిక కూడా అదే సమయం లో ఉండనున్నట్లుగా ఈసీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా 31 స్థానాలకు ఉప ఎన్నికల వాయిదా.. కేవలం నాలుగు స్థానాలకే నగారా

దేశవ్యాప్తంగా 31 స్థానాలకు ఉప ఎన్నికల వాయిదా.. కేవలం నాలుగు స్థానాలకే నగారా

దేశవ్యాప్తంగా 31 స్థానాలకు ఉప ఎన్నికలను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మాత్రం మూడు స్థానాలకు, ఒడిశాలో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోనూ, ఒడిశా లోనూ ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ పశ్చిమ బెంగాల్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనుంది.

 పశ్చిమ బెంగాల్ లో మూడు సీట్లకు, ఒడిశాలో ఒక సీటుకు ఎన్నికలు, సెప్టెంబర్ 30 న పోలింగ్

పశ్చిమ బెంగాల్ లో మూడు సీట్లకు, ఒడిశాలో ఒక సీటుకు ఎన్నికలు, సెప్టెంబర్ 30 న పోలింగ్

సెప్టెంబర్ 30 న భాబానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (పశ్చిమ బెంగాల్) లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని సంసర్‌గంజ్ మరియు జాంగిపూర్ లలో కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు గా తెలుస్తుంది. ఒడిశా రాష్ట్రంలోని పిప్లిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 3 న లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 13... నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ 16

నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 13... నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ 16

నాలుగు స్థానాలకు ఉప ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం నామినేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 13 గా వెల్లడించింది . అభ్యర్థులు తమ పేర్లను సెప్టెంబర్ 16 వరకు ఉపసంహరించుకోవచ్చు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి ఓడిపోయారు, అక్కడ ఆమె భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన సువేందు అధికారితో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడుపశ్చిమబెంగాల్లో మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం, మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీ లోకి రావడానికి మార్గం సుగమం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+