వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాదరి కిశోర్‌కు రూ. 18 వేలు, సైదిరెడ్డికి రూ.45 వేలు: కరెంట్ చార్జీల అపోహలపై మంత్రి జగదీశ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ బిల్లు చూసి సామాన్యుడి నుంచి సంపన్నుడు ఒక్కసారిగా నోరు తెరిచాడు. సగటున గత రెండు నెలల కన్నా బిల్లు ఎక్కువ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఉదాహరణకు గత రెండునెలల్లో రూ.800 ఉన్న బిల్లు మూడో నెలకు వచ్చేసరికి రూ.1600 చేరింది. అంతేకాదు లాక్ డౌన్ సడలింపుల వల్ల కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. లేదంటే కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో కరెంట్ బిల్లు గురించి ప్రజలు పడుతున్న ఆందోళనపై మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

2019 మార్చి బిల్లు ఇప్పుడు కట్టండి .. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు.. షాక్ లో వినియోగదారులు2019 మార్చి బిల్లు ఇప్పుడు కట్టండి .. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు.. షాక్ లో వినియోగదారులు

అపోహే...?

అపోహే...?

కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందనేది అపోహ మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ నెల బిల్లుతో అందరూ అనుమాన పడ్డారని.. కానీ పైసా ఎక్కువగా రాలేదని చెప్పారు. మూడు నెలల బిల్లు కావడంతో ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తోందని తెలిపారు. వేసవిలో ఎక్కువ కరెంట్ వాడటంతో శ్లాబ్ మారి ఎక్కువ వచ్చిందనే అపోహలో ఉన్నారని చెప్పారు. కానీ బిల్లులో పైసా ఎక్కువగా లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఓకే కిస్తీలో బిల్లు కట్టమని అనుకుంటే.. 3 నెలల్లో చెల్లించాలని సూచించారు.

 1.5శాతం వడ్డీ...

1.5శాతం వడ్డీ...

3 నెలలు చెల్లించేవారికి 1.5 శాతం వడ్డీ పడుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. జూన్ నెలలో 30, జూలైలో 40 శాతం, ఆగస్ట్ 30 శాతం చొప్పున రెగ్యులర్ బిల్లుతో కలిపి కట్టాలని సూచించారు. జూన్ నెలలో బిల్లు కట్టాలని, లేదంటే పవర్ కట్ చేస్తామని చెప్పారు. మూడు వాయిదాల్లో కరెంట్ బిల్లు కట్టేవారు ఈఆర్వోలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కిస్తీ రూపంలో చెల్లించే కరెంట్ బిల్లు ఇళ్లలో వాడేవారికి మాత్రమేనని నొక్కి వక్కానించారు.

ఎమ్మెల్యేలు కూడా..

ఎమ్మెల్యేలు కూడా..

కరెంట్ బిల్లులపై ప్రజలే కాదు ఎమ్మెల్యేలు గందరగోళానికి గురయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌కు రూ.18 వేలు, సైదిరెడ్డికి రూ.45 వేల కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పారు. వారు తనవద్దకు వస్తే.. విద్యుత్ అధికారులు వివరించడంతో వారు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. విద్యుత్ సెక్రటరీ అజయ్ మిశ్రాకు కూడా రూ.21 వేల కరెంట్ బిల్లు వచ్చిందని... ఆయనతో సిబ్బంది డిస్కష్ చేశారని తెలిపారు. వారికి అధికారులు సమగ్రంగా వివరించడంతో అర్థమైందని తెలిపారు. కరెంట్ బిల్లులో తేడా, అనుమానాల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. సందేహాం ఉన్నవారు కాల్ చేయాలని సూచించారు.

Recommended Video

Posani Krishna Murali Helps TV5 Reporter Manoj Kumar Family
అలా ఉండదు..

అలా ఉండదు..

కరెంట్ బిల్లులకు స్లాబ్ జంప్ అనేది ఎప్పుడూ ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వల్ల నెల నెల నెల మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేకపోయిందని వివరించారు. ఈఆర్సీ ఆదేశాల మేరకు మూడు నెలల యావరేజీ ప్కారం బిల్లు ఇచ్చామని గుర్తుచేశారు. పేపర్, కరెన్సీ నోట్లపై వైరస్ వస్తుందనే ఆందోళనలో రీడింగ్ తీయడం వీలుకాలేదని చెప్పారు. అనుమానం ఉన్నవారు హెల్ప్ డెస్క్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

English summary
telangana state no power charge hike in state Energy minister jagadish reddy said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X