తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చిన చిక్కు!: ఏపీ ఎలా చేస్తోంది?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా రాష్ట్ర ఉద్యోగులకు ప్రమోషన్ మోక్షం కలగడం లేదు. గత ఏడాది జూన్ 2న అపాయింటెడ్ డే వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది.
అయితే, ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లు లేవు. ఇందుకు సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి... ప్రమోషన్ల పైన నిషేధం విధించడం కారణం. 2013 నుంచి ఇది కొనసాగుతోంది.
ప్రమోషన్ల పైన నిషేధం అనంతరం... ఇప్పటి వరకు వేలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు. వీరు ప్రమోషన్లు, వాటికి సంబంధించిన ప్రయోజనాలు పొందకుండానే రిటైర్ కావాల్సి వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ అంశం సమస్య కొలిక్కి రాలేదు. త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముంది.
అయితే, కొందరు తెలంగాణ ఉద్యోగులు మాత్రం... ఇప్పటికే ఉద్యోగుల పంపిణీ పూర్తి అయిన 45 విభాగాలలో ప్రమోషన్ల విషయమై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఉద్యోగుల పంపిణీ పూర్తయిన విభాగాలు ఉన్నప్పటికీ... ప్రమోషన్ల విషయమై ఉద్యోగుల పంపిణీ అంశాన్ని చూపించవద్దని కోరుతున్నారు.
అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రమోషన్లు ఎలా ఇస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సచివాలయం, ఇతర విభాగాల్లో ఏపీ ప్రమోషన్లను అమలు చేస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి విధించిన నిషేధం ఏపీలో కూడా వర్తించాలి కదా అంటున్నారు. తద్వారా, ప్రభుత్వం వాదన కారణంగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications