ఎవరూ లేరు: మాల్యాకు హైద్రాబాద్ కోర్టు వారెంట్‌లో కొత్త ట్విస్ట్
హైదరాబాద్: బ్యాంకులను రూ.9వేల కోట్ల వరకు చీటింగ్ చేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ మాల్యాకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు పంపిన నోటీసులలో కొత్త ట్విస్ట్. చెక్ బౌన్స్ కేసులో విజయ మాల్యాకు న్యాయస్థానం కొద్ది రోజుల క్రితం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అది తిరిగి వచ్చింది.
శంషాబాద్ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న జీఎంఆర్ సంస్థకు మాల్యా విమానయాన సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిపడింది. ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీఎంఆర్ కోర్టుకెక్కింది.
ఈ కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు మాల్యాను దోషిగా తేల్చింది. అయితే నిందితుడు హాజరుకాకుండా శిక్ష విధించలేమని న్యాయస్థానం నాడు చెప్పింది. కోర్టుకు రావాలంటూ మాల్యాకు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు తిరుగుటపాలో ఎర్రమంజిల్ కోర్టుకే తాజాగా వచ్చాయి.

వారెంటుతో పోలీసులు ముంబైలోని విజయ మాల్యా హౌస్‌కు వెళ్లారు. అయితే, దానిని మహారాష్ట్ర విలేపార్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. హౌస్‌ను బ్యాంక్ అధికారులు సీజ్ చేసినట్లు విలేపార్లే పోలీసులు లిఖితపూర్వకంగా తెలిపారు. అందులో కింగ్ ఫిషర్ అధికారులు లేరని పేర్కొన్నారు. దీంతో, న్యాయస్థానం కొత్త వారెంట్ జారీ చేయాలని, అతని కొత్త చిరునామాను జూన్ 6వ తేదీలోగా కోర్టుకు తెలపాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications