Medaram: మేడారంలో ధరల మోత.. కోడికి రూ.400, యాటకు రూ. 10 వేలు..
మేడారం జనసంద్రంగా మారింది. వనదేవతలను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వెళ్లారు. అయితే మేడారం అమ్మవారి దర్శించుకునేందుకు టికెట్ లేదు. అక్కడ ప్రసాదాలు కూడా అమ్మరు. దేవతలకు మొక్కు చెల్లించుకోవడానికి ఎలాంటి ఖర్చు లేదు. కానీ భక్తుల జేబుకు మాత్రం భారీగా చిల్లు పడుతోంది. అక్కడ ఏది కొనాలన్న భయపడిపోతున్నారని జనం. చిన్న ఆట వస్తువులు మొదలుకుని కోడీ, యాట పిల్లల ధరలు భారీగా ఉన్నాయి.
దర్శనం అనంతరం చల్ల కూల్ డ్రింక్ తాగాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక మందు బాబులు మందు తాగాలంటే రూ.500 నోటు తీయాల్సిందే. బయట మార్కెట్‍లో దొరికే ధరలకు ఇక్కడి షాపులోళ్లు అమ్ముతున్న ధరలకు భారీ తేడా కనిపిస్తోంది. బయట కన్నా ఇక్కడ డబుల్, ట్రిఫుల్ ధరలకు అమ్ముతున్నారు. సాధారణంగా కొబ్బరి కాయ రూ. 20 నుంచి రూ.35 మధ్య ఉంటుంది. కానీ మేడారంలో కొబ్బరికాయ రూ.100 అమ్ముతున్నారు.

కోడి కిలో మామూలుగా అయితే రూ. 120 నుంచి రూ.140 ఉంది. కానీ మేడారంలో కిలో కోడిని రూ. 280 నుంచి రూ. 310 వరకు విక్రయిస్తున్నారు. కోడిని కోసి ఇవ్వడానికి రూ.100 తీసుకుంటున్నారు. ఇక నాటు కోడి ధర చెప్పనవసరం లేదు. దీంతో చాలా మంది భక్తులు ఇంటి నుంచి కొబ్బరి కాయలు, పూజ సమాను తెచ్చుకుంటున్నారు. కోడి తీసుకెళ్తామంటే.. ఓన్ వెహికిల్ ఉండాలి. పైగా ఎండకు కోడి చనిపోయే అవకాశం ఉంది. దీంతో అక్కడ కోళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఇక యాట విషయానికొస్తే మరి దారుణంగా ఉంది. 10 నుంచి 12 కిలోల మేకకు రూ.8,500 నుంచి రూ.10,500 తీసుకుంటున్నారు. దాన్ని కోయడానికి రూ.1000, తలికాయ, కాళ్లు కాపితే రూ.400 తీసుకుంటున్నారు. భక్తులను దండుకుంటున్నారు. లైట్ బీర్ బయట వైన్ షాపుల్లో రూ.150 ఉండగా ఇక్కడ రూ.250 నుంచి రూ.260 పలుకుతుంది. దీంతో చాలా మంది ఇంటి బీర్ కాకుండా లిక్కర్ తెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications