పేకాటరాయుళ్ల అడ్డా: ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్(ఫోటోలు)
హైదరాబాద్: పేకాట కేంద్రంగా మారిన హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధ రాత్రి ఆకస్మక దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రీక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను ప్రభుత్వం గత కొద్ది నెలలు కింద మూసివేసింది. దీంతో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్‌లలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫర్నీచర్‌ను సైతం సీజ్ చేశారు.
పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆయా పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, కేశవరెడ్డి అనే వ్యక్తుల పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతోందని తెలిపారు.
ఈ రెండు క్వార్టర్లలోని ప్రజా ప్రతినిధులు ఇటీవలే ఖాళీ చేయడంతో పేకాటరాయుళ్ల అడ్డగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, పట్టుబడినవారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉన్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

పేకాటరాయుళ్ల అడ్డాగా మారిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్
పేకాట కేంద్రంగా మారిన హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధ రాత్రి ఆకస్మక దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పేకాటరాయుళ్ల అడ్డాగా మారిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్
రీక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను ప్రభుత్వం గత కొద్ది నెలలు కింద మూసివేసింది. దీంతో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.

పేకాటరాయుళ్ల అడ్డాగా మారిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్‌లలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫర్నీచర్‌ను సైతం సీజ్ చేశారు.

పేకాటరాయుళ్ల అడ్డాగా మారిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్
ఈ రెండు క్వార్టర్లలోని ప్రజా ప్రతినిధులు ఇటీవలే ఖాళీ చేయడంతో పేకాటరాయుళ్ల అడ్డగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, పట్టుబడినవారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉన్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

Click it and Unblock the Notifications