వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ సాగిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఓ కుగ్రామంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ గ్రామంలో కరోనా రాకుండా గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ తీసుకున్న చొరవ, పాటించిన జాగ్రత్తలు ఆ గ్రామానికి శ్రీరామరక్షగా నిలిచాయి. ఇంతకీ ఆ గ్రామం ఏదంటే..

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నా, మేడిపల్లి మండలం రాగోజిపేట్ లో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఓ చిన్న కుగ్రామమైనప్పటికీ కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ గ్రామస్తులు తీసుకుంటున్న జాగ్రత్తలే అందుకు కారణం. రాగోజిపేట్ గ్రామంలో మొత్తం 382 గృహాలు ఉండగా, పదకొండు వందల యాభై మంది అక్కడ నివసిస్తున్నారు. వీరంతా కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ గ్రామంలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నారు.

గ్రామంలో స్వచ్చంద లాక్ డౌన్ పెట్టుకున్న గ్రామస్తులు

కరోనా ఫస్ట్ వేవ్ లో కేవలం మూడు కేసులు నమోదు చేసిన ఈ గ్రామంలో ఇప్పటివరకు సెకండ్ వేవ్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామస్తులంతా స్వీయ నియంత్రణ పాటించి, గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకుని, ఎక్కడ ఎవరు గుమికూడి ఉండకుండా,కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ గ్రామ సర్పంచ్ కూడా గ్రామస్తుల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.

గ్రామ ప్రజలకు అండగా ఆరోగ్య రక్షణలో సర్పంచ్ చొరవ

గ్రామ ప్రజలకు అండగా ఆరోగ్య రక్షణలో సర్పంచ్ చొరవ

పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైడ్ చల్లించడం, డ్రైనేజీ పనులను, శానిటేషన్ వర్క్ ను దగ్గరుండి చూసుకోవడం చేస్తున్నారు సర్పంచ్. ఇక గ్రామం లోకి వచ్చే మార్గాలను మూసివేసి, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే వారిని ఆపి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడమే కాకుండా, మాస్కులు, శానిటైజర్ ఇచ్చి ఎక్కువ సేపు గ్రామంలో ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్న సమయంలో రాగోజిపేట్ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్

కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్


దీంతో పక్క గ్రామాల ప్రజల దృష్టి ప్రస్తుతం రాగోజిపేట్ గ్రామంపై పడింది. ఏది ఏమైనా కుగ్రామమే అయినప్పటికీ ఈ గ్రామస్తులు చేస్తున్న పని అన్ని గ్రామాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుంది. కుగ్రామమే అయినప్పటికీ కరోనా కట్టడిలో సమర్థవంతంగా పని చేసిన ఈ గ్రామానికి, గ్రామస్తులకు, వారికి సహకరిస్తున్న గ్రామ సర్పంచ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

English summary
In Ragojipet village in Jagtial district during the covid second wave, not a single corona case has been reported . Despite being a small hamlet, the villagers imposed a voluntary lock-down and taking corona precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X