వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చే దిన్ కాదు సచ్చె దిన్.!కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న భట్టి.!

|
Google Oneindia TeluguNews

మధిర/హైదరాబాద్ : దేశ ప్రజలకు అచ్చే దిన్ తీసుకొస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ రోజు రోజుకు ధరలను పెంచుతూ ప్రజలకు సచ్చే దిన్ తీసుకువచ్చాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. 2014 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 350 రూపాయల ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోడీ సర్కార్ 8 ఏళ్ల పాలనలో 1,050 రూపాయలకు పెంచి ప్రజలపై తీవ్రమైన భారాలు మోపిందని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై గురువారం చింతకాని మండలం పాతర్ల పాడు నుంచి రైల్వే కాలనీ, నాగులవంచ, సీతంపేట, చిన్న మండవ గ్రామాల్లో భట్టి పాదయాత్ర చేశారు.

 కేంద్ర విదానాలపై మండిపడ్డి సీఎల్పీ నేత భట్టి

కేంద్ర విదానాలపై మండిపడ్డి సీఎల్పీ నేత భట్టి


వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల.. కేంద్ర విదానాలపై మండిపడ్డి సీఎల్పీ నేత భట్టి
అచ్చే దిన్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, టోల్ చార్జీల ధరల పెంచడంతో పాటు పేద, సామాన్యులు జ్వరం వస్తే వేసుకునే గోలీల పైన కూడా పన్నుల భారం వేయడమేనా అని భట్టి ప్రశ్నించారు. పేదలపై పన్నుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు బడ్జెట్లో రాయితీలు కల్పించి సబ్ కా వికాస్ అని ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలి అని విమర్శించారు. డీజిల్ ధర వంద రూపాయలు దాటితే దాని ప్రభావం వ్యవసాయం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మీద పడిందని వివరించారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో పేద సామాన్యులకు ఒరిగిందేమీ లేదని బడా కార్పొరేట్ శక్తులకు మాత్రం దేశ సంపదను పంచి పెడుతున్నారని దుయ్యబట్టారు.

 ప్రజలపై భారం మోపడంలో పోటీ పడుతున్నారు.. మోడీ, కేసీఆర్ లపై భట్టి ఫైర్

ప్రజలపై భారం మోపడంలో పోటీ పడుతున్నారు.. మోడీ, కేసీఆర్ లపై భట్టి ఫైర్

బిజెపి అవలంబింస్తున్న విధానాలు, మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ధరలు పెంచడం లో కేంద్రంతో పోటీపడుతూ రాష్ట్రప్రభుత్వం కూడా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల పైన భారం వేస్తున్నదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్న ధరలతో పేద, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకై పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నానని వివరించారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం..పాదయాత్రలో హామీ ఇచ్చిన భట్టి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం..పాదయాత్రలో హామీ ఇచ్చిన భట్టి

పాదయాత్రలో తనతో కలిసి వేసిన అడుగుల సవ్వడి పాలకుల గుండెలు అదిరే విధంగా ఉండాలని, ఇందుకోసం తాను తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తన అడుగుల్లో అడుగులు వేస్తూ ప్రజలు కదం తొక్కితే పాలకుల కోటలు కూలిపోతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు తీసుకొస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు తో పాటు రైతులకు వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇస్తామని భట్టి వెల్లడించారు.

 దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ.. ప్రధానికి సామాన్యుడి కష్టాలు తెలియవన్న భట్టి

దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ.. ప్రధానికి సామాన్యుడి కష్టాలు తెలియవన్న భట్టి

రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించేలా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భట్టి ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని ఇది రాజకీయ ఎన్నికల యాత్ర కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

English summary
Bhatti questioned whether Achche Din would mean raising petrol, diesel, gas and toll prices, as well as imposing taxes on the pills of the poor and common people in case of fever. He criticized the central government for imposing the tax burden on the poor and saying that the corporate powers and the rich should be ashamed to subsidize the budget and promote it as sub ka vikas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X