కొత్త పార్లమెంట్‌ను స్వాగతించిన అసదుద్దీన్ ఒవైసీ: తెరపైకి కొత్త డిమాండ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే తాను భవన ప్రారంభోత్సవానికి వెళ్తానని లేదంటే వెళ్లనని తేల్చి చెప్పారు.
మరోవైపు, పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని ప్రారంభిస్తే తాము ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని పేర్కొన్నాయి. మే 28న జరిగే పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీతోపాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ-ఎం సహా 19 పార్టీలు హాజరుకాబోమని ఇప్పటికే స్పష్టం చేశాయి.

ప్రధాని ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం రాష్ట్రపతిని అవమానిండచమేనని విపక్షాలు వ్యాఖ్యానించాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానించడమేనని వ్యాఖ్యానించాయి. పార్లమెంటును ప్రభుత్వాధి నేత కాకుండా దేశాధి నేత ప్రారంభించాలని డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ప్రారంభించాలన్న వాదనను సమర్థించనని అన్నారు. కొత్త పార్లమెంటు భవనం అవసరమే.. దాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ, ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం కావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
విపక్షాల నేతలు ఎవరూ తమను సంప్రదించలేదని ఒవైసీ తెలిపారు. అయితే, విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కావాలన్నారు. ఇందుకు ప్రధాని మోడీ అంగీకరించాలన్నారు. ఒకవేళ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభిస్తే.. ఆ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతానని ఒవైసీ స్పష్టం చేశారు.
కాగా, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానం మేరకు మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగితే.. లోక్‌సభ ఛాంబర్‌లో మొత్తం 1,280 మంది సభ్యులకు వసతి కల్పించవచ్చు. ప్రధాని మోడీ డిసెంబర్ 10, 2020న కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications