తెలంగాణ సర్కార్ జాబ్ నోటిఫికేషన్ : గురుకుల విద్యాసంస్థల్లో భారీ ఖాళీలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం భారీ కొలువల జాతరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలను భర్తీ చేయడానికి ముందు నుంచి విడుతల వారీగానే నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తోన్న ప్రభుత్వం తాజాగా అధిక సంఖ్యలో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 1794 పోస్టుల ప్రకటన విడుల చేసింది సర్కార్. ఇందులో గురుకుల పాఠశాల పరిధిలో ఉన్న 1164 పోస్టులతో పాటు, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది ప్రభుత్వం. గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 758 పోస్టులతో పాటు అదనపు పోస్టులను కూడా జోడించి తాజా నోటిఫికేషన్ ను వెలువరించింది ప్రభుత్వం.

Notification for 1794 vacancies in gurukula welfare

ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ విషయంలో తర్జన భర్జనలకు ఇంకా తెరపడినట్లు లేదు. కొత్తగా ప్రభుత్వం అనుమతించిన 593 పోస్టులతో కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలా.. లేక పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారానే మొత్తం భర్తీలు చేపట్టాలా అన్నదానిపై ఇంకా సందిగ్దత వీడలేదు. కాగా, సెప్టెంబర్ నాటికి అన్ని సమస్యలను అధిగమించి నోటిఫికేషన్ విడుదల చేయాలనే టీఎస్పీఎస్సీ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana govt was released Notification for 1794 vacancies in gurukula welfare schools, woman colleges. through TSPSC these posts were filled

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి