ఆ 2జిల్లాల్లో..: ఇక తెలంగాణ జిల్లాలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌: ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన ఎంపిక శిబిరాలు విజయవంతం కావడంతో ఆ పార్టీ తెలంగాణపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాల్లో జనసైన్యాన్ని ఎంపికచేయాలని నిర్ణయించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌.

జూన్ 24న ఆదిలాబాద్‌, 25న కరీంనగర్‌ జిల్లాల్లో జనసేన శిబిరాలను నిర్వహిస్తున్నట్టు పవన్ తెలిపారు. ఈ రెండు జిల్లాల పరిధిలోని ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూన్ 22, 23 తేదీల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Now Pawan Kalyan focus on Telangana districts

జూన్ 24న మంచిర్యాల జిల్లాలోని ఫారెస్ట్‌ కాంట్రాక్టు అసోసియేషన్‌ ఫంక్షన్‌ హాలులో, 25న పెద్దపల్లి జిల్లాలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ ఎంపిక శిబిరాలు ఏర్పాటుచేయనున్నట్టు పవన్‌ తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోని పక్షంలో నేరుగా వేదిక వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పవన్ స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+