ఎన్నారై భర్త నిర్వాకం: 'రమ్య ఇష్యూలో ఆ 2 గంటల్లో ఏదో జరిగింది!' (పిక్చర్స్)
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాదులోని కేపీహెచ్‌బీ మహిళ రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో పదిరోజుల క్రితం మరణించింది. దీనిపై రమ్యకృష్ణ తల్లి ఉషారాణి మాట్లాడుతూ.. చనిపోయిందన్న గంట ముందే తన కుమార్తె ఫోన్లో మాట్లాడిందని తెలిపారు.
రమ్యకృష్ణ పది రోజుల క్రితం ఆస్ట్రేలియాలో మృతి చెందింది. శుక్రవారం రాత్రి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు వచ్చారు. రమ్యకృష్ణకు నాలుగేళ్ల క్రితం మెల్‌బోర్న్‌కు చెందిన మహంత్‌తో వివాహం జరిగింది. కుమార్తె మృతిపై రమ్యకృష్ణ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తనతో మాట్లాడిన తర్వాత మళ్లీ కాల్ వచ్చిందని, ఆ ఒకటి రెండు గంటల్లో ఏం జరిగిందో తెలియదని, కాని చనిపోయిందని రమ్యకృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆ విషయాన్ని మహంత్ కూడా చెప్పలేదని, అతడి కంపెనీలో పని చేసే అబ్బాయి సమాచారం ఇచ్చాడన్నారు.
తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. చాలా ధైర్యవంతురాలని, కష్టాలకు అధైర్యపడదన్నారు. కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదం జరిగిందని, అప్పుడు కూడా ఆమె ధైర్యంగా ఉందని తల్లి చెప్పారు. తన కూతురు మృతికి కారణమైన వారిని శిక్షించాలన్నారు.
తన కూతురిని అత్తామామలు సూటిపోటి మాటలతో వేధించేవారని చెప్పారు. ఎన్నోసార్లు తనతో చెప్పుకొని బాధపడిందన్నారు. పరోక్షంగా కారకులైన వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన కుమార్తె మృతదేహం ఇచ్చేంత వరకు తమను మహంత్ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారని రమ్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మహంత్ తండ్రి చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల్లేవన్నరు. కావాలనే తన కొడుకు పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో తల్లిదండ్రులకు అప్పగించి మహంత్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

రమ్యకృష్ణ, మహంత్
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో వదిలేసి భర్త మహంత్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు.

రమ్యకృష్ణ, మహంత్
రమ్య అనే వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె 10 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిసింది. రమ్య మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు.

రమ్యకృష్ణ, మహంత్
శంషాబాద్ విమానాశ్రయంలోనే రమ్య మృతదేహాన్ని వదిలి మహంత్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రమ్య పేరిట ఆస్ట్రేలియాలో సుమారు రూ. 2.5 కోట్ల బీమా చేసినట్లు సమాచారం.

రమ్యకృష్ణ, మహంత్
పాస్‌పోర్టు ఉంటేనే బీమా వస్తుందని మృతురాలి బంధువులను డిమాండ్ చేసి పాస్‌పోర్టు తీసుకుని తిరుగుటపా కట్టాడని ఆరోపిస్తున్నారు. కాగా డబ్బు కోసమే రమ్యను భర్త మహంతే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

రమ్యకృష్ణ, మహంత్
మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటున్న మహంత్‌తో హైదరాబాద్ కూకట్‌పల్లి వాసి రమ్య వివాహం జరిగింది.

రమ్యకృష్ణ, మహంత్
వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో మహంత్ గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం రమ్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రమ్యకృష్ణ, మహంత్
భార్య చనిపోతే బీమా వాయిదాలు కట్టాలని మహంత్ బాధపడ్డాడని రమ్య కుటుంబ సభ్యులు అంటున్నారు. భార్య చనిపోతే రెండు వేల డాలర్లకు బాధపడ్డాడని వారన్నారు. భార్య కన్నా బీమా సొమ్మే అతనికి ముఖ్యమైందని అన్నారు.












Click it and Unblock the Notifications