భార్యను, బిడ్డను అర్థరాత్రి ఎయిర్‌పోర్టులో వదిలేసి ఎన్నారై పలాయనం
హైదరాబాదు విమానాశ్రయంలో భార్యను, ఆరు నెలల బిడ్డను వదిలేసి ఓ ఎన్నారై పలాయం చిత్తగించాడు. దీంతో ఆమె రోడ్డెక్కింది.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో ఎన్నారై మోసం వెలుగు చూసింది. పెళ్లి చేసుకున్న తర్వాత నిండా రెండేళ్లు కూడా గడవక ముందే కట్టుకున్న భార్యను, ఆరు నెలల బిడ్డను విమానాశ్రయంలో వదిలేసి ఓ ఎన్నారై పలాయనం చిత్తగించాడదు.
హైదరాబాదులోని రామంతపూర్‌కు చెందిన యాలాల శరీషకు రెండేళ్ల క్రితం కీర్తిసాయి రెడ్డి అనే ఎన్నారైతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శిరీషను అతను అమెరికా తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను అతను చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అరు నెలల బాబుకు తల్లి పాలు ఇవ్వకుండా అడ్డుకుని వేధింపులకు గురి చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. భర్త, అత్త కలిసి శిరీష నుంచి చిన్నారిని విడదీసి చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో ఆరు నెలల బాబుతో పాటు శరీషను అతను వదిలేసి వెళ్లిపయాడు.
దాంతో శరీష గురువారంనాడు తల్లిదండ్రుల సహాయంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు చెప్పింది. భర్తతో తనను కలపాలని ఆమె మీడియా సమావేశంలో కోరింది. శిరీష్ తల్లిగారిల్లు నల్లగొండ జిల్లా కోదాడ. తల్లి చెప్పుడు మాటలతో తనను భర్త వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. గర్భిణి అయిన తనను విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది.












Click it and Unblock the Notifications