కూతుర్ని హైద్రాబాద్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించిన గుంటూరు ఎన్నారై
హైదరాబాద్: గుంటూరు జిల్లా చీరాలకు చెందిన ఓ ఎన్నారై.. హైదరాబాదులోని కాప్రా ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్పించడంతో పాటు ఆ పాఠశాలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. చాలామంది ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రయివేటు పాఠశాలల్లో చదివించేందుకు ఇష్టపడతారు.
అలాంటిది ఓ ఎన్నారై తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో పాటు దానిని దత్తత తీసుకోవడం గమనార్హం. గుంటూరు జిల్లా చీరాలకు చెందిన వంశీ మాచిరాజు కొలరాడోలో పని చేశారు.
ఆయనకు లలిత ప్రణీత అనే ఎనిమిదో తరగతి చదివే కూతురు ఉంది. ఆమెను హైదరాబాదులోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇది కాప్రాలో ఉంది. ఆ పాఠశాలను అతను దత్తత కూడా తీసుకున్నారు. తొలుత తన కూతురును ఓ ప్రయివేటు స్కూల్లో చేర్పించారు.

ఈ ఏడాది కాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. తొలుత ప్రణీత ఆ పాఠశాలలో ఇతరులతో మాట్లాడే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. యాస, భాష సమస్య అయ్యాయి. ఆ తర్వాత ప్రణీత వారితో కలిసిపోతోంది. ప్రణీత వయస్సు 13.
ప్రణీత పాఠశాలలోని తోటి విద్యార్థులకు గణితం, ఆంగ్లం, కంప్యూటర్ బేసిక్స్ తదితరాల్లో సహకరిస్తోంది. వంశీ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి 'ఆర్గనైజింగ్ ఫర్ ది ఫ్యూచర్'ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వంశీకి తిరిగి అమెరికా వెళ్లడం ఆసక్తి లేదని తెలుస్తోంది. ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications