ఎన్టీఆర్ ఆ పార్టీకే ఓటు వేశారా..? వీడియోతో ఇలా దొరికిపోయారేంటీ..?
టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సమయంలో ఆయన చేసిన సైగలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివారాల్లోకి వెళ్తే...తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మరీ వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఎన్టీఆర్ తన ఓటు వేశారు. ఆయనతో పాటు భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దాదాపు గంటపాటు పోలింగ్ కేంద్రం ఆవరణ క్యూలో నిల్చొని మరి సామాన్యుడులా ఓటు వేశరాయన.అయితే ఈ సమయంలోనే ఎన్టీఆర్ ఓ పార్టీకి అనుకులంగా సైగలు చేశారనే ప్రచారం జరుగుతుంది. ఆయన క్యూ లైన్‌లో సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద తనకు తెలిసిన వ్యక్తి కనిపిస్తే తన చేతిని పైకి ఎత్తి ఎన్టీఆర్ హాయ్ చెప్పారు.
Jr. NTR - #MaarpuKavaliCongressRavali
— Madhusudhan Reddy (@TheMsReddy) November 30, 2023
Vote for Congress❣️❣️ pic.twitter.com/DxyoJ8LIvr
దీంతో ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాను కాంగ్రెస్ గుర్తుకే ఓటేయబోతున్నట్లు, ప్రజలు కూడా అదే గుర్తుకు ఓటేయాలని ఎన్టీఆర్ సూచిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ నిజంగానే కాంగ్రెస్‌కు ఓటు వేయమన్నారా లేదా అన్నది ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.












Click it and Unblock the Notifications