వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నుమాయిష్ 2023: అనుమతి ఇవ్వొద్దు; హైకోర్టులో న్యాయవాది పిటీషన్.. ఎందుకంటే!!

|
Google Oneindia TeluguNews

82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 1 2023 నుంచి ప్రారంభం కానున్న ప్రతిపాదిత 82వ ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ ప్రభుత్వంలోని వివిధ వాటాదారుల పై పిటిషన్ దాఖలు చేశారు.

నుమాయిష్ కు అనుమతి ఇవ్వొద్దు.. హైకోర్టులో పిటీషన్

నుమాయిష్ కు అనుమతి ఇవ్వొద్దు.. హైకోర్టులో పిటీషన్

ఎగ్జిబిషన్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జనరల్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ తో పాటు హైదరాబాద్ సిటీ పోలీసుల నుండి కూడా చట్టబద్ధమైన అనుమతులు పొందలేదని తాను దాఖలు చేసిన పిటిషన్లో న్యాయవాది తెలిపారు. తెలంగాణ అగ్నిమాపక సేవలు చట్టం 1999 నిబంధనల ప్రకారం నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు లేఅవుట్ ఆమోదం పొంది, దాని కింద రూపొందించబడిన నిబంధనల ప్రకారం నుమాయిష్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే, వారి యొక్క నిబంధనలకు, ఆమోదాలకు లోబడి నుమాయిష్ నిర్వహించాల్సి ఉంటుంది.

జీహెచ్ఎంసీ, సిటీ పోలీసుల అనుమతులేవీ?

జీహెచ్ఎంసీ, సిటీ పోలీసుల అనుమతులేవీ?

జిహెచ్ఎంసి నుండి జీహెచ్ఎంసీ చట్టం 1955 నిబంధనల ప్రకారం జీవో తో సహా తప్పనిసరిగా అవసరమైన ఇతర అనుమతులను పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ పోలీసుల నుండి కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నుమాయిష్ సొసైటీ అవేవీ లేకుండా నుమాయిష్ నిర్వహణకు ప్రయత్నం చేస్తోందని అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తే దీనికి సంబంధించి అధికారులు కూడా బాధ్యులు అవుతారని అడ్వకేట్ ఖాజా ఐజాజుద్దీన్ తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

నుమాయిష్ పై సుప్రీం ను కూడా ఆశ్రయించిన న్యాయవాది

నుమాయిష్ పై సుప్రీం ను కూడా ఆశ్రయించిన న్యాయవాది

నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం చట్టవిరుద్ధమని, అసమంజసమని పేర్కొన్నారు. ట్రేడర్ లకు మాత్రమే అవకాశం ఇవ్వకుండా సాధారణ ప్రజలను, వ్యాపారులను స్టాల్స్ కోసం దరఖాస్తులకు పిలవాలని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు 2022 జనవరిలో అడ్వకేట్ ఖాజా ఐజాజుద్దీన్ సుప్రీంకోర్టులో ప్రత్యేక సెలవు పిటిషన్ ను దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన పిల్ లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు.

నుమాయిష్ పై విచారణ.. వివిధ ప్రభుత్వాధికారులకు నోటీసులు

నుమాయిష్ పై విచారణ.. వివిధ ప్రభుత్వాధికారులకు నోటీసులు


అయితే 2022వ సంవత్సరం ఆగస్టులో జస్టిస్ డి వై చంద్రచూడ్, ఏఎస్ బోపన్న మరియు జెబి పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సూచనతో పిటిషన్ ను కొట్టివేసింది. ఇక తాజాగా తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి వివిధ ప్రభుత్వ అధికారులకు దీనిపై నోటీసులు జారీ చేశారు.

English summary
Numaish Society will be ready to organize Numaish 2023. However, lawyer Khaja Izazuddin filed a petition in the High Court that the permission of the GHMC, Fire and Hyderabad City Police had not been taken by the society and permission should not be given.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X