మహిళ ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు: బీపీఓ నిర్వాహకుడితోపాటు నలుగురు అరెస్ట్

హైదరాబాద్: ఓ మాజీ ఉద్యోగినిపై ఫేస్‌బుక్‌ ఖాతాలో అసభ్యకరంగా కామెంట్లు చేసిన ఓ కంపెనీ నిర్వాహకుడు, అతడికి సహకరించిన వారిని సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్‌రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

సికింద్రాబాద్‌లోని ఒక బీపీఓ సెంటర్‌లో సదరు మహిళ రెండు నెలలు పనిచేయగా ఆమెకు జీతం ఇవ్వకుండానే పనిలో నుంచి తొలగించారు. కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ నిర్వాహకుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఉద్యోగులతో జాలీగా గడిపిన ఫొటోలను ఆమె ఫేస్‌బుక్‌లో చూసింది.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, జల్సాలు చేస్తున్నారని అందులో కామెంట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఖాదర్.. సదరు మహిళ ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టి ఆమెను బెదిరిస్తూ అసభ్య పదజాలంతో కామెంట్లు చేశాడు.

Obscene posts in Facebook: Four arrested

వాటిని చూసిన బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్దుల్ ఖాదర్, అమిత్ లాల్‌వానిలను గత వారం అరెస్టు చేయగా ఎ కేంద్ర బిస్త, కెవిన్స్ రోస్, మహ్మద్ అర్బజ్, సోలోమన్ పెన్సికోను అరెస్టు చేశారు. కేసును అదనపు డీసీపీ కె విజేందర్‌రెడ్డి, ఏసీపీ అనురాధ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ పి రాజు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని ఒకరు మృతి

ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీరాంపూర్ మండలానికి చెందిన నాగరాజు, సుచిత దంపతులు తమ నాలుగు నెలల కుమార్తెతో బైక్‌పై మంచిర్యాలకు బయలుదేరారు.

సీసీ కాంప్లెక్స్ సమీపంలో వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా సుచిత తీవ్రంగా గాయపడింది. చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+