ఆమెకు 13ఏళ్ళు, ఆయనకు 52 ఏళ్ళు, ఆమెను ఇంట్లోనే నిర్బంధం, అందుకేనా?

13 ఏళ్ళ బాలికను 52 ఏళ్ళ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. అయితే బాలికను కుటుంబసభ్యులు ఇంట్లోనే నిర్భంధించారు.ఈ విషయాన్ని తానుచదువుకొనే పాఠశాల టీచర్లకు బాలిక చేరవేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

దేవరకొండ:పేదరికంతో 14 ఏళ్ళ బాలికకు 52 ఏళ్ళ వ్యక్తికి వివాహం చేశారు .ఈ వివాహన్ని వ్యతిరేకించినందుకు బాలికను ఇంట్లోనే నిర్భంధించారు బాలిక తమ పాఠశాల టీచర్లకు సమాచారం చేరవేయడంతో పోలీసులు బాలికను రక్షించారు. నిందితులపై కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండలో చోటుచేసుకొంది.

నల్గొండ జిల్లా దేవరకొండ మండలంల పెంచికల్ పహడ్ గ్రామంలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ పాళశాలలో త్రిపురారం మండలం బిక్యతండాకు చెందిన 13 ఏళ్ళ బాలిక 8వ, తరగతి చదువుతోంది.

ఈ బాలికది నిరుపేద కుటుంబం.తల్లిదండ్రులు దాణావత్ కోటి, జిజాలు.గత ఏడాది మే మాసంలో వేసవి సెలవులకు ఈ బాలిక తన అక్క సుజాత వద్దకు వచ్చింది.

officials obstructed child marriage in nalgonda district

అయితే నాంపల్లి మండలం రాజ్యనాయక్ తండాకు చెందిన రామావత్ రవి కి భార్య చనిపోయింది. ఆయన వయస్సు 52 ఏళ్ళు.అయితే తన భార్య చనిపోవడంతో ఈ బాలికను పెళ్ళిచేసుకోవాలని ఆయన భావించాడు.

ఈ మేరకు బాలిక కుటుంబసభ్యులను కూడ అంగీకరించారు.అయితే గత ఏడాది మే 29వ, తేదిన కొండమల్లేపల్లిలో వివాహం చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు ఈ వివాహన్ని అడ్డుకొన్నారు.ఐదుగురిపై కేసుపెట్టారు.

2016 అక్టోబర్ 5న, నాంపల్లి మండలంలోని శివాలయంలో పెళ్ళిచేశారు. బాలిక తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తే కుటుంబసభ్యులు ఇంట్లోనే నిర్భంధించారు. ఈ నెల 1వ, తేదిన బాలిక తప్పించుకొంది.

తాను చదువుకొన్న పాఠశాల ఉపాధ్యాయులకు బాలిక ఫోన్ చేసింది.తన పరిస్థితిని వివరించింది.అయితే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కు సమాచారం ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమశాఖాధికారి నరోత్తం రెడ్డి, ఐసిడిఎస్ పిడి పుష్పలత, గురుకుల పాఠశాల కో ఆర్డినేటర్ నాగేశ్వర్ రావు నల్గొండ నుండి గురువారం రెసిడెన్షియల్ పాఠశాలకు చేరారు.

బాలిక వివాహం విషయమై విచారించారు. బాలికను నిర్భంధించి వివాహం చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నట్టు దేవరకొండ డిఎస్ పి రవికుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+