Ration Card e-KYC: అలా చేయకుంటే మీ రేషన్ కార్డు కట్..!

బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాలని స్పష్టం. ఈ ప్రక్రియ గత 5 నెలలుగా కొనసాగుతోంది. అయితే రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవడానికి జనవరి 31 తేదీ తుది గడువుగా ఉంది. అలోపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీని సింపుల్ గా చేసుకోవచ్చని చెబుతున్నారు.

రేషన్ డీలర్లకు వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి.. ఆ తర్వాత వేలిముద్రలు నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుందని వివరిస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు. జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ సూచించారు. భారత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా రేషన్ బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నారు.

Officials say that ration card should be done by KYC by January 31

అయితే చాలా రేషన్ కార్డుల్లో చనిపోయిన వారిని పేరును తొలగించలేదు. ఉదాహరణకు ఒక్క రేషన్ కార్డులు తాత, తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తాత అనారోగ్య సమస్యతో చనిపోయాడు. అయినప్పటికీ ఆ కుటుంబం చనిపోయిన వ్యక్తి పైరు రేషన్ తీసుకుంటుంది. ఇలా లక్షలాది మంది రేషన్ తీసుకుంటున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనిషి బతికుండాలి.

సో.. రేషన్ కార్డు ఈ కేవైసీతో చాలా పేర్లు తొలగించడం వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా కానుంది. రేషన్ కార్డు ఈ కేవైసీకి కేంద్రం ఇప్పటికే పలుమార్లు ఈకేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. తెలంగాణలో డిసెంబర్ 30 నాటికి 70.80 శాతం ఈకేవైసీ పూర్తి అయినట్లు సివిల్ సప్లై అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+