Prajapalana: ప్రజాపాలన పట్ల అధికారుల నిర్లక్ష్యం.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం..
ప్రజాపాలన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తాజాగా ప్రజాపాలన దరఖాస్తులను భద్రపరచడంతో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సోమవారం బాలానగర్ లో డేటా ఎంట్రీ కోసం అభయహస్తం దరఖాస్తులను తరలిస్తుండగా రోడ్డుపై పడిపోయాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు.
దీనికి బాధ్యులైన హయత్ నగర్ సూపరింటెండెంట్ మహేందర్ ను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ లోనూ అభయహస్తం దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపించడంతో సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.

అర్హులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తులన ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు.కోటి 25లక్షల అప్లికేషన్లను 30 వేల మంది జనవరి 30 వరకు ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వెబ్ సైట్ కూడా ప్రారంభించారు.
ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్‌కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టిని నియమించారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. డేటా ఎంట్రీ పూర్తి తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications